నీటిమీద రాతలు
నీటి మీదరాతలు గాలిలో
మాటలు అంటారు కదా!
నేటి సమాజపు బ్రతుకులు
నమ్మలేని నిజాలు
నిగ్గు తేలని ఆరోపణలు
నిబద్ధత లేని వాక్కులు
రాజకీయాల రణ రంగంలో
సామాన్యుని దుస్థితి
చేయలేని చేతనలో
అర్థంకాని అపస్థితి లో
సరితూగని సమస్యతో
వ్యతిరేకపు భావనలు
నేటితరం పోకడలు
వాక్దానపు వనరులే
మిగిలిపోయే చివరికి
నీటిమీద రాతల వలె
చెరిగిపోయే చెప్పిన కల్లబొల్లిమాటలు
నడమంత్రపు సిరి ఒక్కటే
చేసేను ఇంత మాయ మనిషిని ……..?
– జి జయ