నీటి బొట్టు

నీటి బొట్టు

ఆటవెలది:

మొయిలు దాచె నంట మదిలోన మృదువుగా
ధరణి పైన పంట దరికి పిలిచె
పరుగు పరుగు నొచ్చె పొలముకై చిరువాన
నేల తడిపె నటులె నీటి బొట్టు

తేటగీతి:

కలువ పైనున్న నినుచూడ కనుల పంట
విలువ నీకన్న అధికము కలుగరెవరు
చెలియ కన్నులో నీవుంటె చెడ్డ భయమె
మునిగు ఆల్చిప్ప యదలోకి ముత్యమునుగు

– కోట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *