నీకేమైంది….?
మధురమైనక్షణాలు ముందరే ఉంచి,
మరిచిపోలేని జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ
ముందర ఉన్న కొలను వైపుకు ఉలుకుపలుకు లేని చూపులు చూస్తూ..
ఎప్పుడో గడిచిన కాలం,ఇప్పుడే జరిగినట్టుగా పదేపదే ఊహిస్తూ
ఉలిక్కి పడుతూ ఒంటరితనమే ఒక వారసత్వంగా భావించి
ఊరి చివరన ఉత్తర దిశగా చూసే ఓమనిషీ నీకేమైంది….?
– కుమార్ రాజా