హాని చెయ్యని దయ్యం
నేను చుట్టూ ఎక్కువ ఇళ్ళు లేని ఇంట్లో నివసిస్తున్నాను. అలాగే పర్యావరణం చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ చాలా చెట్లు ఉన్నాయి గ్రీనరీ కూడా ఎక్కువే. ఇక్కడికి వచ్చినవారు వెళ్ళడానికి ఇష్టపడరంటే నమ్మండి…
నా ఇల్లు చాలా పెద్దది మాది నలుగురు సభ్యుల కుటుంబం. పెద్ద ఇంట్లో తక్కువ మంది ఉంటె ఆ ఇంట్లో కచ్చితంగా ఎదో దయ్యం ఉంటుందని చాలామంది నమ్ముతారు. కానీ నా నమ్మకం ఏంటంటే, ఇలాంటి ఇళ్ళల్లో దయ్యాలు ఉండవని. కానీ ఆ విషయం నిజమే నాని నాకు ఈ సంఘటన వల్లె తెలిసింది.
కొన్ని నెలల క్రితం మేమంతా విహారయాత్రకు వెళ్లి బాగా అలసిపోయాం. దాదాపు మధ్యాహ్నం 2:00 గంటలైంది. నేను నా మంచం మీద పడుకున్నాను. నేను నిద్రలోకి జారుకుంటున్నాను, నా కళ్ళు మూసుకున్నాయి. నా తలపై ఎవరో నిమురుతునట్టు అనిపించింది.
నా నుదిటిపై ఉన్న ఒక చేయి, నేను అలసిపోయి మా అమ్మ ఒడిలో పడుకున్నప్పుడు అమ్మ ఎలాగైతే చేత్తో మసాజ్ లాగా చేస్తుంది. నేను షాక్‌తో మేల్కొన్నాను, తలుపు వైపు చూశాను నా తలుపు లాక్ చేయబడింది. నా చుట్టూ ఎవరూ లేరు. నేను కలలు కన్నానా? నాకు తెలియదు. అది మిస్టరీ గానే ఉంది.
ఆ సంఘటన తర్వాత, ఒక రోజు నా తమ్ముడు తన స్కూల్ నుండి వచ్చినప్పుడు చాలా నీరసంగా కనిపించాడు. మనం ఆరోజు జరిగిన సంఘటనను మనల్ని బాధ పెట్టిన విషయం అయితే ఎవరితోనైనా పంచుకుంటాము. అప్పుడు మనం రిలాక్స్డ్ గా ఫీల్ అవుతాము.
నేను నా తమ్ముడిని తీసుకొని నా రూమ్ బాల్కనీలోకి వెళ్లి ఏమైందని అడిగాను. ఎవరైనా వస్తే బాగోదు అని డోర్ క్లోజ్ చేసాను. మా ఇద్దరి మధ్య గాఢమైన డిస్కషన్ జరుగుతుంది. ఒక్కసారిగా ఇద్దరం నిశ్శబ్దంగా ఉండిపోయాం.
ఎందుకంటే, మా వెనుక నిలబడి ఉన్నారని భావించాము. అయితే అది మా అమ్మ అని భావించి వెంటనే టాపిక్ మార్చాము. తర్వాత డోర్ లాక్ చేసామని తెలుసుకుని ఇద్దరం వెనక్కి తిరిగాము కానీ, అక్కడ ఎవరూ కనిపించలేదు. ఉన్న తలుపు తాళం వేసి ఉండిపోయింది. ఇది కూడా ఒక మిస్టరీగానే ఉంది.
ఈ సంఘటన తర్వాత, నా తమ్ముడు మళ్లీ నా గదిలోకి రాలేదు. అయితే, కొన్ని రోజుల క్రితం, రాత్రి 1:00 గంటల సమయంలో. నేను నా టెడ్డీ నుండి చాలా భిన్నమైన శబ్దం విన్నాను. నా టెడ్డీ 5 అడుగులు.
ఆ శబ్దాలు ఏడుపు శబ్దంలాగా, గాఢమైన స్వరంలో ఏడ్చేవిగా చాలా కలవరపెడుతున్నాయి. నేను పరుగెత్తుకుంటూ నా గదిలోంచి బయటకి వచ్చి నా తమ్ముడిని లేపాను. నా తమ్ముడు నా గదిలోకి రావడానికి ఇష్టపడలేదు.
కానీ ఎలాగోలా అతన్ని నా గదిలోకి లాక్కువేల్లాను. కానీ, ఇప్పుడు ఏ శబ్దం వినిపించడం లేదు. నా తమ్ముడు టెడ్డీ దగ్గరికి వెళ్లి నిశితంగా చూసినప్పుడు ఆ టెడ్డి కళ్లలో ఏదో ప్రతిబింబం కనిపించింది.
అతను టెడ్డీని కింద పడేసి, నన్ను ఆ రూమ్ నుండి బయటకి తీసుకోచ్చేసాడు.
అయితే ఆ దయ్యం, నాకు కానీ నా తమ్ముడికి కానీ ఎలాంటి హానీ చెయ్యలేదు.
వీటన్నింటిని మా తల్లిదండ్రులకు తెలియజేశాము, వారు ఇంటి గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు.
అన్నట్టు, మీరు ఆత్మలను నమ్ముతారా?
– రంజిత్