నీ నవ్వు వెలుగవ్వు
జ్ఞాపకాల శిశిరానికి చోటివ్వు
వసంతాల చెలిమికి మాటివ్వు
మాటవినని లోకం బాధవ్వు
పంచదా ఆనందం నీ నవ్వు
అలుపులేని సంతోషపు బాటవ్వు
వేడుకల జీవితము వీలవ్వు
తనూలతకు ఓదార్పుల పలుకవ్వు
మురిపాల కోటకే వెలుగివ్వు
సంబరమై మనసంతా దారివ్వు
రివ్వుమంటూ ఎగరదా చిరునవ్వు
ముస్తాబైన ముచ్చట్ల పలుకవ్వు
అనుభూతులిక తలదువ్వు
కలల కాంతుల కేకవ్వు
కోటిరాగాల కోనవ్వు
వెలుగు పూల తోటవ్వు
పరవశాల నీ నవ్వు పాటవ్వు
– సి.యస్.రాంబాబు