నీ కోసం
మనసు లోని అన్వేషణ నీ కోసం
వేచి వున్న పరిచయాల భావన నీ కోసం
మదినిందిన ఊహలు నీ కోసం
కోటి ఆశల అంతరంగం నీ కోసం
కోరికల మూటలైనవి నీ కోసం
ప్రేమే సాక్షాత్కరించింది నీ కోసం
ఎందరినో వదులుకున్న బంధం నీ కోసం
వేచియున్న వేదికైనది నీ కోసం
అనురాగాల ఆరగింపులు నీ కోసం
ఆరాటాల ఈ పయనం నీ కోసం
నమ్మకమే నడిచింది నీ కోసం
మనసిచ్చిన నాడే మురిసింది నీ కోసం
నీతో నడుస్తున్న ఈ జీవిత పయన మే
నిజమని తెలుసుకున్న ఈ భావాన్ని
అక్షర సుమాలుగా నీ కోసం నీ కోసం
-జి.జయ