నరకయాతన

నరకయాతన

ఒక అబ్బాయి… మధ్యతరగతి కుటుంబం లో పుట్టి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ..వాళ్ళ తల్లితండ్రుల కన్నీరు చూడలేక.. తుడవలేక..  ఎం చేయాలో అర్థం కాక… చదువు పేరుతో బయటికి వచ్చేశాడు… అప్పటి నుండి అటు చదువుతూ.. తన ఖర్చులకు సరిపడు ఏదో ఒక పని చేసుకుంటూ గడుపుతున్నాడు.. ఇంట్లో అమ్మ నాన్నలకి చెప్పి ఏదో ఒక పని చేస్తూ చదువుకుంటానని అన్నాడు…

అపుడు ఆ తల్లితండ్రులు మేము ఉన్న అన్ని రోజులు నీకు ఎలాంటి కష్టం కలగనివ్వము… మేము చదువుకోక ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నము.. నీకు చెల్లికి అలాంటి పరిస్తితి రాకూడదు అనే మాకు ఎంత కష్టమైన మీరు భారం అనుకోకుండా మా బాధ్యత అని చదివిస్తున్నము అని అంటారు అపుడు ఆ అబ్బాయి సరే అమ్మ అని ఫోన్ పెట్టేసాడు..

వెంటనే ఆమె భర్త పక్కనుండి, అదేంటే అలా అన్నావు.. వాడు ఏదో ఒక పని చేస్తూ చదువుకుంటానని అన్నాడు కదే… అలాగే అని చెప్పకుండా ఎందుకే వద్దు అన్నావు అంటాడు. అపుడు భార్య.. అది కాదండీ.. ఇప్పుడు వాడు ఉద్యోగం అని వెతుకులాట మొదలుపెట్టి ఏదో ఒక ఉద్యోగంలో చేరితే ఇటు పని చేయలేక, అటు చదుకోలేక ఎంతో ఇబ్బంది పడతాడు..

అలాంటి పరిస్థితిలో డబ్బు ఆశతో చదువు ఆపేస్తే.. వాడి జీవితం ఇక్కడి నుండే ఆగిపోతుంది కదా అండి అంటుంది.. అపుడు భర్త నిజమేనే నువ్వు చెప్పింది కూడా అంటాడు.. ఇక వాడిని చదువుకొమ్మనడం మంచిది మన లాగా మన పిల్లలు ఈ కష్టాలు అనుభవించకుండా.. సంతోషంగా సుఖంగా ఉండాలి అనుకుంటారు…

ఇక పోతే ఆ అబ్బాయి బయటికి వెళ్లి చదువు ఒకటే కాదు ఇంట్లో అలాగే అంటారు అని ఒక కంపెనీ లో ఉద్యోగం లో చేరాడు.. ఇటు చదువు, అటు ఉద్యోగం రెండు చక్కగా చూసుకుంటున్నాడు.. ఇలాంటి పరిస్థితిలో ఒక ప్రేమ అనే అలజడి ఆ అబ్బాయి జీవితం లో మొదలైంది… ఈ అబ్బాయిని వలలో వేసుకుని.. సర్వం ఊడ్చింది…

ఇంట్లో అవసరానికి అవసరాలు తీర్చుకోడానికి సంపాదించాలి అనుకున్నా తను.. తన వలలో పడి ఇల్లు పరిస్థితే మర్చిపోయాడు.. ఆ అమ్మాయి కోసం పేదవాడు అంటే ఎక్కడ దూరం అవుతుందో అని అబద్ధపు జీవితాన్ని నటించడం మొదలు పెట్టాడు… ఇలా ఇటు ఇంట్లో పరిస్థితులు కూడా ఎం బాగాలేవు.. చెల్లికి పెళ్లి చేయాలి అని ఇంట్లో నుండి ఫోన్.. కానీ ఈ అబ్బాయి అంతగా పట్టించుకునే పరిస్థితిలో లేడు. ఆ తల్లి తండ్రులు ఎం తోచని స్థితిలో ఉన్నారు.

అలా కొద్ది రోజులు గడిచాయి. ఆ అమ్మాయి ఇంకొకర్ని చూసుకుంది. ఈ అబ్బాయి అది గమనించి నిలదీశాడు. తను తిరగబడింది. ఈ అబ్బాయి అది తట్టుకోలేకపోయాడు.. ఆత్మ హత్య చేసుకున్నాడు. ఇంట్లో ఈ వార్త తెలిసిన తల్లితండ్రుల గోడు అంతా ఇంతా కాదు.. ఎదిగిన కొడుకు చేదోడు వాదోడుగా ఉంటాడు అనుకుంటే. తలకొరివి పెడతాడు అనుకుంటే వాడికి తలకొరివి పెట్టే పరిస్థితిని కల్పించిన భగవంతుడిని తిడుతూ కన్నీరు మున్నీరు అవుతున్నారు…. అన్నీ తానే అయి చూసుకుంటాడు అనుకునే తల్లి తండ్రులకు ఇంత కంటే నరక యాతన ఉంటుందా…?

దయచేసి ఇది చదివే ప్రతి ఒక్కరూ తెలుసుకోండి తెలియజేయండి. ఎందుకంటే ఈరోజుల్లో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మోసాలకు పాటు పడుతున్నారు. ఇది తట్టుకోలేని వాళ్ల పరిస్థితి వల్ల మీరు చేసే మోసం వల్ల మీరు జీవించే అబద్ధపు జీవితం వలన వారి తల్లి తండ్రులకు కడుపుకోత తీరని శోకం.. ఇలా ప్రేమ అనే పేరుతో వారి జివితాల మధ్య దూరి అలజడులు సృష్టించి అతలాకుతలం చేసి మనోవేదనకు గురి చేసి కన్న వారిని బతికి ఉన్నప్పుడే నరకం లోకి తోయకండి…

– వనీత రెడ్డీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *