కర్షక చక్రవర్తి
కవుల రాతల్లో రైతు రారాజు..
నాయకుల మాటల్లో రైతు మహారాజు..
తన చేతల్లో రైతు శ్రమరాజు..
కానీ..
బ్రతుకు నాగలి దున్నే క్షేత్రంలో కర్షకుడు..
విమర్శలను అందుకుంటున్న దురదృష్టవంతుడు.
సంసార బాధ్యతలలో ఆర్థిక కష్టాలు అనే కలుపులను తీయ సామర్థ్యం సాధించలేని సాధుపుంగవుడు.
చావులో కూడా నేలతల్లిని విడలేక ఆత్మను పైర గాలికి దానం చేసి, తనువును ధరణికి తర్పణం అందించే చక్రవర్తి.
– శంభుని సంధ్య