నమ్మకం వున్నా చోట
కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావు…అలానే ప్రతీది అబద్ధం కూడా కాదు…ఒకరిని చూసి వారిపై చెడు అభిప్రాయానికి రావడం కూడా మంచిది కాదు సుమా…ఒకరు మనపై కోపగించుకుంటే అది మన మంచికే అనుకోవాలి కానీ…ఎవరో నాకు చెప్పేది ఏంటి అని అపార్ధం చేసుకోకూడదు…
ఎవరినైనా నువ్వు ఏమి సాధించలేవు ,ఎందుకు పనికిరావు అని వారిపై అపనమ్మకంతో అపార్థం చేసుకోకు…వారికీ వున్నా బలం,ఆలోచన శక్తి, సంకల్పం మనకు తెలియదు కదా…ఒక మనిషిని అపార్థం చేసుకోవడం ఎంతసేపు…
రెప్పపాటు క్షణం కూడా తక్కువే కదా…బంధువులు, స్నేహితులు పలకరించలేదని ,ఒక గ్లాసు మంచినీళ్లు చేతికి అందించలేదని ఎంత పొగరు…! అని అపార్థం చేసుకుంటమే…
కానీ వాళ్ళు ఎందుకు పలకరించలేకపోయారు ఏదో పనిలో, కష్టంలో ఉన్నారా అని మనసుకి సర్ది చెప్పుకుంటే అపార్థానికి త్రోవ ఎక్కడ నేస్తమా…
అపార్థం మనుషులను దూరం చేసి మనసులో మౌనాన్ని నింపి ఒంటరిగా ఉండిపోయేటట్లు చేస్తుంది…
అదే మనిషి మీద నమ్మకంతో వారిని అర్థం చేసుకుంటే ఈ అపార్ధాలు, ద్వేషాలు మన మధ్య ఉండవు సుమా…
పుస్తకపు అట్టని చూసి ఒక అంచనాకు వచ్చేయకు…మొత్తం పేజీలు చదివి వాళ్ల భావాలను, కోపాలను,సంతోషాలను,మంచి తనాన్ని అర్ధం చేసుకో…
మాట తీరుని బట్టి మనిషిని అంచనా వేసేస్తూ అపార్థం చేసుకోకు మా…
ఆ మాట వెనుక ఉన్న వాళ్ళ బాధను,కఠిన మనసును ఆ మనసులో జరిగే సంఘర్షణలను గ్రహించు…
అప్పుడు నీకు ప్రతి ఒక్కటి అందంగా,అద్భుతంగా, ఆహ్లాదకరంగా, మనశ్శాంతిగా కనిపిస్తూ ఉంటుంది…
నమ్మకం వున్నచోట అపార్థాలకు త్రోవ ఉండదు…
అపార్ధాలు ఉన్నచోట నమ్మకం కనిపించదు…అందుకే ప్రతి ఒక్కరిని అర్ధం చేసుకోవడం నేర్చుకో నేస్తమా…
-పల్లా క్రాంతి కుమారి