ముంచేస్తారు

ముంచేస్తారు

 దేవి ఇంటర్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో పని చేసుకుని అక్కకి తోడుగా ఉంటుంది. దేవి కొత్త పాత అని చూడకుండా అందరితో స్నేహంగా మాట్లాడుతుంది.

అలాగే వాళ్ళ పక్కింట్లోకి ఒక కుటుంబం వచ్చారు.దేవి వాళ్ళతో  అప్పుడప్పుడు మాట్లాడుతుండేది.
దేవి ప్రేమ విషయం ఇంట్లో తెలిసి చాలా గొడవలు జరుగుతున్నాయి.దేవికి , అమీరాతో స్నేహం పెరిగింది.

అది ఎంతలా అంటే ప్రతిరోజు మధ్యాహ్నం పూట దేవి వాళ్ళింటికి వెళ్ళే అంతలా స్నేహం పెరిగింది. అలా ఇంట్లో జరిగిన గొడవలు గురించి చివరికి తన ప్రేమ విషయం కూడా తన అమీరాకి చెప్పింది దేవి.

అమీరా దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని దేవి ప్రేమించిన వ్యక్తికి ఫోన్ చేసేది.ఈ విషయం వాళ్ళ అక్కకి తెలియక దేవి వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటే పంపించేది.

ఒక నెల రోజులు తర్వాత అమీరా పిలిస్తే దేవి పనిలో ఉండడం వల్ల తన దగ్గరికి వెళ్ళలేదు.
“ఏంటక్కా పిలిచావు?” అని అడిగింది దేవి.దేవి మీద కోపంతో ఉండి ,”ఏమీ లేదు ఊరికి పిలిచాను?” అని చెప్పేసింది అమీరా.

రెండు రోజుల తర్వాతబయట దేవి ముగ్గు వేస్తుంది.అమీరా బయట నీళ్లు చల్లుతుండగా ఆ నీళ్లు దేవి మీద పడ్డాయి.“ఏంటక్కా కొంచెం చూసుకోవచ్చు కదా. నీళ్లు నా మీద పడ్డాయి” అని కొంచెం చిరాగ్గా చెప్పింది దేవి.

“సర్లే…” అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది అమీరా.శ్రీను కోపంగా ఇంట్లోకి వచ్చి “దేవి… దేవి ఎక్కడున్నావ్?” అని గట్టిగా పిలిచాడు.పనిలో ఉన్న దేవి వెంటనే ఉలిక్కిపడి ,

“హా… వస్తున్న అన్నయ్య” అని చెప్పి శ్రీను దగ్గరికి వచ్చింది.“నువ్వు ప్రతిరోజు పక్కింటి అక్క దగ్గరికి వెళ్తున్నావా?అక్క ఫోన్ తీసుకొని సాకేత్ కి ఫోన్ చేసావా?” అని సూటిగా అడిగాడు శ్రీను.

“లేదు… అన్నయ్య ఇంట్లో గొడవలు జరుగుతున్న దగ్గరనుండి , మీరు నాకు ఫోన్ ఇవ్వడం లేదు. అలాంటిది నేను ఫోన్ ఎలా చేస్తాను?” అని అడిగింది దేవి.

“ఆ పక్కింటి అక్కే నాకు చెప్పింది” అని చెప్పాడు శ్రీను.“ఈ మధ్యన మా ఇద్దరికీ ఏదో చిన్న గొడవ వల్ల నీకు అలా అబద్ధం చెప్పి ఉండొచ్చు అన్నయ్య” అని కొంచెం కంగారుగా చెప్పింది దేవి.

“లేదు… నాకు ఆ అక్క కాల్ లిస్ట్ కూడా చూపించింది. సాకేత్ నెంబర్ ఉంది” అని చెప్పాడు శ్రీను.
‘నా పర్సనల్ సీక్రెట్స్ ఆ అక్కకి చెప్తే నన్ను ఇంతగా నమ్మకద్రోహం చేసింది. ఈ విషయాలన్నీ మా అన్నయ్యకి చెప్పి నన్ను ఇంకా బాధ పెట్టింది.

స్నేహం అనే మూసుకు వేసుకొని మంచిగా నటించి నట్టెట్లో ముంచేసింది అని మనసులో అనుకుంది దేవి.’

“అన్నయ్య… అది సాంకేత్ నెంబర్ కాదు , కావాలంటే ఒకసారి కాల్ చేసి ఇప్పుడే మాట్లాడు” అని ధైర్యంగా చెప్పింది దేవి.

శ్రీను దేవి ముందే ఆ నెంబర్ కి కాల్ చేశాడు.“హలో… ఎవరండీ మీరు?” అని అవతల వాళ్ళు అడిగారు.
*హలో… మీ పేరు సాకేత్ ఏనా” అని అడిగాడు శ్రీను.

“లేదు సార్… మేము కస్టమర్ కాల్ నుంచి చేస్తున్నాను” అని చెప్పాడు అతను.వెంటనే ఆ మాట విని శ్రీను కాల్ కట్ చేసేసాడు.“ఇప్పుడేమంటావ్ అన్నయ్య?” అని అడిగింది దేవి.

“క్షమించు… నీ మీద అనుమానం ఉన్నది నిజమే , కానీ మళ్ళీ నువ్వు ఎక్కడ తప్పు చేస్తావని నిలదీశాను. కానీ దీంట్లో నీ తప్పు లేదని తెలిసింది అని చెప్పాడు శ్రీను.

“సరే… నాకు కొంచెం బయట పనుంది వెళ్తాను” అని వెళ్ళిపోయాడు శ్రీను.“నువ్వు నిజంగానే సాకేత్తో మాట్లాడావు కదా” అని అడిగింది దేవిని అడిగింది వాళ్ళ అక్క.

“మాట్లాడాను అక్క , కానీ నమ్మిన వాళ్లే మోసం చేస్తారని అనుకోలేదు. నన్ను నట్టేట్లో ముంచేశారు. అలాంటి వాళ్ళని ఊరికే వదలను” అని కోపంగా చెప్పింది దేవి.

అందుకే ఎన్నిసార్లు చెప్పాను నీకు నేను అందరి దగ్గర మన విషయాలు చెప్పకూడదు మన సీక్రెట్ లు పంచుకోకూడదు అందరూ మంచివాళ్లను కూడా మనం తప్పు అది గుర్తుపెట్టుకో ఇప్పటికైనా కళ్ళు తేరు ఎవరు అలాంటి వాళ్ళు తెలుసుకో అని దేవి వాళ్ళ అక్క చెప్పింది.

నన్ను క్షమించు అక్క ఇంకెప్పుడూ ఎవరిని నమ్మను. ఇలాంటి వాళ్లని నమ్ముకుంటే నట్టింట్లో ముంచేస్తారని తెలుసుకున్నారు. అని చెప్పింది దేవి.

 

-మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *