నాన్నా…
అస్తమయం కాదుర,
అస్తమాను ఏడవకు!
ఉషోదయం చూడరా,
ప్రతిరోజూ నవ్వుతూ!
అలుపసలే ఉండదు,
ఒకే దారి తిరిగినా!
గెలుపెపుడో తెలియునా?
గెలుపేదో తెలుసుకో!
కిరణమొకటి చాలదా,
చీకట్లను చీల్చదా?
నాన్నా…
భూమిని సూర్యుడికి చాలా ఇష్టం..
అందుకే ప్రతిరోజు పొద్దున్నే వచ్చేస్తాడు..
ఇన్నాళ్ళలో ఏ రోజూ సెలవు తీస్కోలేదు
– సత్యసాయి బృందావనం