నా వెనకే నువ్వు
నీ తీయని కబుర్లు నాలో రాగలెన్ని పలికించాయి.
మధురమైన ఊహల్లో తెలెలా చేశాయి
నీ గుండెల మీద తల ఆనించి నా బాధలన్నీ చెప్పాలని
నువ్వు నన్ను ఓదారుస్తూ ఉంటే పరవశించి పోవాలని ఎన్నో కలలు కన్నాను.
కానీ ఆ తీయని కబుర్ల వెనక కటినమైన విషం ఉందని,
ఆ మధుర భావాల వెనక ఆ కారణమైన కోపాగ్ని దాగుందని,
ఆ గుండెల నిండా పగ అనే విషయం పడగ విప్పుకుని నిల్చుంది అని,
నా బాధ లు చెప్తుంటే నీ మనస్సులో నవ్వుకున్నావు అని,
ఒక్క ఓదార్పు మాట కూడా చెప్పకుండా,
కనీసం చూడనైనా చూడకుండా అవసరం లేదనీ,
ఇది ఉత్త రాతి బొమ్మని వదిలి వెళ్ళావు. నేనంటే ఎందుకంత కక్ష,
ఎందుకంత నిర్లక్ష్యం, ఎందుకంత చిన్న చూపు ఓహో ఏమి చేయలేని దాన్ని అనేనా
నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారని పోగరా ఎందరు ఉన్నా, ఎవరు అడ్డు వచ్చిన,
ఎవరెన్ని వెనకాల గోతులు తవ్విన నా ఆశయం, లక్ష్యం మారదు.
ఒక్కటి గుర్తు పెట్టుకో ఎప్పటికైనా నా వెనకే నువ్వు ….
– భవ్య చారు