ఏంటో ఈ మనుషులు
హృదయంలో స్వార్థపూరిత జ్వాల,
వారి గురించి మాత్రమే ఆలోచన,
ఏ మాత్రం ఆలోచించకుండా పరులకి మోసం,
మోసం చేసినా ఉండదు ఇసుమంత బాధ,
పరులు కానైనా రారు,
గోడు చెవికి చేరదు.
అంతా నాకే కావాలి అనే అత్యాశ,
అత్యాశ అవసరానికి తేడా తెలియని మనోస్థితి.
కానీ అలా ఉండి వారు సాధించేది ఏంటి?
చేసిన పని వల్ల వచ్చిన ఒంటరితనం తప్ప!
సంతోషం అంటే ఇవ్వడంలో ఉంటుంది.
నాకు తెలిసింది కూడా అదే,
నువ్వేం చేసిన నేను మళ్ళీ మరిచిపోయి,
నా చేతిని నీకు ఇవ్వడానికి ఇంకా నేను సిద్ధం.
ఎందుకుంటే నేను వస్తువులు కాదు,
మనస్సును నమ్మే మనిషిని కనుక.
– ఈగ చైతన్య కుమార్