నా జోహార్లు…
బ్రిటిష్ బానిసత్వం నుండి బయటపడిన….
తమలో తాము కులాల మతాల బానిసత్వం…
పరిమితులు పెట్టే ప్రజానీకం….
అంటరానితనం అనే అడ్డగోడల మధ్య నలిగిన…..
బడుగు వర్గాల బలహీనతలు మరింత బల పడిన రోజున..
పంచభూతాలకు లేని పక్షపాత ప్రయాణం….
ఎదురు నిల్వలేని ఎగసిపడే ఆక్రోశంలో…
ఉద్భవించే పాల సముద్రాన పంచామృతం……
తమ హక్కులను దోగిలించే అధికారానికి అడ్డకట్టలా..
చట్టాన్ని వ్యతిరేకించే చుట్టాన్నిలా….
అంటరానితనాన్ని అణగ ద్రొక్కే ఆశాజ్యోతి ఆత్మబందువులా…
సర్వసత్తాక, సామ్యవాద లౌకిక, ప్రజాస్వామ్య….
గణతంత్ర రాజ్యాన్ని తెచ్చిపెట్టిన…..
బడుగు వర్గాల బలానికి పునాదిలా నిల్చిన….
డా.బి.ఆర్. అంబేద్కర్ కి
నా జోహార్లు…
– తోగరాపు దేవి