నా దేశం భారతదేశం
పతాకం..
పతాకం వెనుక దాగి ఉన్న ప్రాణ త్యాగం..
నేటి మన జీవన ఆధారం ..
బాపు శాంతి, సహనం నేటి మన స్వాతంత్ర్యం..
ఆనాటి త్యాగఫలం నేటి కవులకు అది వర్ణానాతీతం..
ఆనాటి త్యాగఫలం…
నేడు ఆకాశాయనం భూమి మీద ప్రయాణం…
నరుడి జీవనం..
విదేశీయులు పోగిడిన దేశం…
పచ్చని పైరుల్లో…
ప్రకృతి పరిమళాల్లో– ప్రాణాన్ని పోసే పవనంలో…
పవలితం అయ్యే పర్వాతలాల్లో…
జాలువారే జలపాతాల్లో…
అజంతా, ఎల్లోరా గుహల్లో….
సరిహద్దులోపల కష్టించే కిసాన్ చెమట తడిలో….
సరిహద్దు వెలుపుల సాహసం చేసే జవానులో….
నల్లని మబ్బుల నుండి జాలువారే జడిలో…
పరవసించి, పరిమళించే మట్టి వాసనలో తల్లి భరత మాత భవ్యచరిత్ర వినిపిస్తుంది…..
– తొగారపు దేవి