మునిమాపువేళ
కోరికలు ఆకాశంలా విచ్చుకొన్నవేళ
తొలిమబ్బు చినుకులా
మనసు పరవశిస్తుంటుంది
నవ్వుకుంటూ కాలం
తాళం వేస్తుంటుంది
వెంటేవచ్చే నీడ నిట్టూర్పు గుర్తుందా
జ్ఞాపకాలన్నీ తోసుకుస్తుంటే
కోరికలన్నీ కరిగిపోతుంటాయి
ఈసారి మనసు స్వచ్ఛంగా నవ్వుతుంది
సమయం మహాగొప్పది
మునిమాపువేళలో
నువ్వేమిటో చూపుతుంది
– సి.యస్.రాంబాబు