మౌనానికి మాటవస్తే

మౌనానికి మాటవస్తే

మౌనానికి మాట వస్తే అది
చాలా ఘాటుగా ఇంకా శక్తి తో కలిసి వస్తుంది.
ఆ మాట భరించే శక్తి ఎదుటివారికి కూడా వుండాలి.

అప్పుడు ఆ సమయంలో మౌనం విలువ
ఎంతటిదో అర్థమవుతుంది.

మౌనం వెనక బాధ వుండచ్చు
అది వెంటాడుతూనే వస్తుంది
శక్తిని కూడగట్టుకొని నిజమైన అస్త్రంగా చేస్తుంది.
ఎందరో మహనీయులు
మౌనాన్ని సాధన చేసి వారు
అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేశారు.
అందులో ముఖ్యంగా చెప్పాల్సింది “శాస్త్రవేత్తలు”
మనందరం ఈ రోజు ఇంత
సౌకర్యంగా ఆధునికంగా గడుపుతున్నాము అంటే
వారి అద్భుత ప్రయోగాలే.
వారు మౌనాన్ని పనిగా తీసుకుని శ్రమిస్తారు. ఫలితం మాట రూపంలో
అందరికి అందిస్తారు.
అబ్దుల్ కలాం గారు నిదర్శనం. ఆయన రాకెట్
ప్రయోగ అనంతరం ఒక  మాట చెప్పారు.

మౌనం అనేది బలహీనత కాదు అది ఒక శక్తివంతమైన జవాబు అని .
అన్ని ఇంద్రియాలను అధీనంలో పెట్టుకుంటే వచ్చేది.

భావోద్వేగాలు ధ్యానం, మనో నిబ్బరం, కావాలి.

అది ఒక మానసిక శక్తి. అది మాటగా మారితే
అణు బాంబులు పేలుతాయి
దేశాధ్యక్షులు దీనికి అతీతులు కారు.
సందర్భాన్ని బట్టి మౌనం వీడిన చిక్కుముడి చర్యలుగా పనిచేస్తాయి.

శతృత్వమయినా కావచ్చు,
మిత్రత్వం కావచ్చు,
వేచిన ఉదయం కావచ్చు,
వెలిగే కార్చిచ్చు కావచ్చు,
కలిసే మనసులు కావచ్చు,
తప్పొప్పుల పట్టిక కావచ్చు,
దాచుకున్న ఆలోచనలు కావచ్చు,
దాగిన వేదన కావచ్చు,
కరిగే హృదయం కావచ్చు,
పదునైక ప్రణాళిక కావచ్చు,
కాచే పందెం కావచ్చు,
చెరగని ముద్ర కావచ్చు,
సర్డుకున్న విషయం కావచ్చు,
సతమతమయ్యే బాధ కావచ్చు,
తుఫాను ముందు సముద్రంలా,

మేఘం వెనుక వర్షంలా,

మది గదిలో దాగిన మౌన
రాగాల మాటలు ……….

– జి జయ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *