మన్యం వీరులు – అల్లూరి, కొమరం
1)మన్యవీరులందు మాతృదేశముపైన
పరులపాలనింక పారనీక
పెత్తనమును పూర్తి పెరికి వేయగ బూని
అమ్ము చేతబట్టి అమరుడయ్యె
2)కొదమ సింగమాయె కొమరం భీముడు
మన్య జనుల హక్కు మరచిపోక
పోడు భూమి కొరకు పోరాటములు చేయ
కొమర భీము జిల్ల కోర్కె దీర్చె
– కోట