మనిషి ఉన్నతజీవి
“ఆనందం” అనే భావన తో….
చేప పిల్లలను నీటి తొట్టిలో బంధీస్తున్నాడు…. !
“నా వల్లే బ్రతుకుతున్నాయి”అనే భ్రమ తో…
స్వేచ్ఛ పక్షుల్ని పంజరాల్లొ బంధీస్తున్నారు… !
“ఇంటికి కాపలా”అనే పేరు తో…
విశ్వాసం గల కుక్కలని గొలుసులతో కట్టేస్తున్నారు..!
“భవిష్యత్” అనే భ్రమ తో..
పిల్లల బాల్యాన్ని బలి తీసుకుంటున్నారు…!
“సాంప్రదాయం” అనే సాకుతో..
ఆడవాళ్ళ అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తున్నారు..!
“విద్య” అనే మాయ తో…,
విద్యార్థులను వ్యథకు గురిచేస్తున్నారు… !
“జీతం”అనే పరువు కోసం..,
ఉద్యోగస్తుల్ని బానిసలుగా చేస్తున్నారు..!
“అభివృద్ధి” అనే పేరుతో..,
ఉన్న పొలాలన్నీ ఫ్లాట్స్ గా మారుస్తున్నారు..!
“మా మతం” గొప్పదనే అభిప్రాయం తో…,
జీవ హింసలు చేస్తున్నారు… !
“మానసిక ప్రశాంతత” అనే పేరుతో..,
మగవాళ్ళు మద్యం మత్తుకు అలవాటు పడుతున్నారు..!
“మాంసం” బలం అనే భ్రమతో…,
మూగజీవుల పై దాడులు జరుగుతున్నాయి..!
“రోగం”అనే పదాన్ని భూతంగా చూపిస్తూ…,
పేదల రక్తాన్ని పిలుస్తున్నారు..!
ఇలా మనిషి తన స్వార్థం కోసం సహజంగా ఉన్న ప్రతి వ్యవస్థను తనకు నచ్చినట్లు మార్చు కుంటున్నాడు…
దీనికి అంతం ఎప్పుడో… ! వేచి చూడాలి….!
– టింకు ఎస్