మనసు

మనసు

మనసులోని మాట

మనసు ఓ మనసు

ఎందుకు ఎగిరెగిరి పడతావు

ఎందుకు నీలోని నీ ఆశలనే నింపుకుంటావు

రేపటి నీ తపనాన్ని ఎందుకు జారవిడుచుకోకుండా ఆగుతావు

ఎందుకే మనసా ఇంత ఉవ్వవేస్తున్నావు

మీ మనసు కనిపించడం లేదా

ఇది కాదు అది అవుతుందని

రేపటి ఆశతో మీ మనసును ఎగిసి ఎగిసి పడుతుందా

రేపటి నీ ఈ స్వప్నాన్ని నిజం చేసుకుంటావా

మనసా ఎందుకే నీకింత కలవరం ఎందుకు

జరిగేది జరగక మానదు జరగబోయేది ఎవరు ఊహించలేరు

ఎందుకే మనసా నీకు ఇంత తొందరపాటు

నీ మనసుని

వయ్యారాలు ఒలికిస్తూ,

సింగారాలు చిలికిస్తూ

తత్తర పడుతూ,

బిత్తర చూపులు చూస్తూ,

ఆ కనులలోని అమాయకత్వంతో ఏదో

జరగబోతుందని,

జరుగుతుందని,

జరగాలని

అబ్బ ఆ కన్నులకు ఎంత ఆశ

నీ మనసు ఆకాశం ఎగసిపడుతున్న అలలతో

రేపటి స్వప్నాన్ని నిజం చేసుకోవాలని ఎదురు చూస్తున్న ఓ పిచ్చి మనసా

కాలాన్ని ఆపగలవా

ఎన్నెన్నో కోరికలోనీ మనసులో

నీ మనసు మాట వినకు

అది ఎలా చెబితే అలా చేయకు

ఎన్నెన్నో ఆశలతో మంచిని గ్రహించు

పదిమందిని విచారించు

ఆ తర్వాతే నీ మనసు చెప్పింది విను

ఆలోచించు ఓ మనసా మనసా మనసా ???? 

– కే శారద దేవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *