మన సర్కస్
ఒకడికి సర్కస్ పెట్టాలి అనిపించింది. అందులోకి జంతువుల కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక అందమైన గుర్రము కనిపించింది, దూరం నుంచి చూసాక అతనికి ఒక విషయం అర్థమైంది. ఆ గుర్రం చాలా వేగంగా పరిగెడుతోంది, మిగిలిన గుర్రాలన్నిట్లోకీ అది బలంగాను ఉంది.
మిగిలిన గుర్రాలు చెయ్యలేని పనులని కూడా అది చాలా సునాయాసంగా చేస్తోంది. ఇది గమనించిన అతడు ఆ గుర్రాన్ని పట్టుకుని, తీసుకుని వచ్చి దానికి ఏవేవో విద్యలు నృత్యం చెయ్యటం, రెండు కాళ్ళ మీద నిల్చోవటం ఇంకా కొన్ని విద్యలు నేర్పించాడు.
ఆలా ఆ గుర్రానికి వయసు అయ్యే వరకు అతని దెగ్గరే ఉంచుకున్నాడు. వయసైపోయాక దానిని తిరిగి అడవిలో నీకు స్వేచ్ఛ ఇస్తున్నాను అని వదిలేసాడు.
మన అందరికి సమాధానం ఏంటో తెలుసు.
పై కధలో చిన్న మార్పు చేద్దాం
గుర్రం బదులుగా మనల్ని మనం పెట్టుకుందాం.
ఆ వ్యక్తి బదులు ఒక యజమానిని పెట్టుకుందాం.
ఆ సర్కస్ బదులు ఒక కార్యాలయాన్ని పెట్టుకుందాం.
ఇప్పుడు మళ్ళీ అవే పైన అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఆలోచించండి
ఇంతే కధ.
-వినయ్ ఉటుకూరు
ప్రపంచమే పెద్ద సర్కస్…చాలా బాగుంది మీకు అభినందనలు..💐💐💐💐💐💐
మంచి ఆలోచన కలగ చేసే కథ,చాలా బాగా రాశారు.