మన బాధ్యత
నిరక్షరాస్యత నిర్మూలన
మన బాధ్యత
అక్షరాల అభ్యాసం ఆశ కావాలి ప్రతి ఒక్కరికీ
అది మనిషికి హోదా కాదు
కావాల్సినముఖ్య మైన గుర్తింపు
మాట్లాడేభాష నేర్పును
పుట్టుకతో నే కాని
చదవటం రాయటం కోసం
తరగతి గది అవసరం.
భాష ఏదైనా కాని బ్రతుకు
ఆసరా కోసం చదవాలి
పేదరికం పెను సవాలు అయినా అక్షరాస్యత కూడా
అంతే పెద్ద సామాజిక
అవసరం.
మూఢనమ్మకాలకు మూలం
నిరక్షరాస్యత
మారని దృక్పధాలకు నెలవు
నిరక్ష్యరాస్యత
సమయానికి ఆహారం వలె
సమాజానికి చదువు
అత్యంత అవసరం.
స్త్రీ, పురుష భేదాలుగా కాక
ప్రాధమిక విద్య ప్రాధాన్యం
కావాలి అందరికీ
సాంకేతిక ఎంత వున్నా
అది అందుకునేందుకు
ఆయుధం చదువుమాత్రమే
అర్ధం కాని విషయాన్నైనా
అవరోధాల భాటలైనా అధిక మించడానికి కావాలి
అక్షర చైతన్యం
మనిషిమనిషిగాఎదగాలన్నా భావి తరాల భవితవ్యం
అక్షరాస్యత అందుకు
అవసరం
నేటి డిజిటల్ యుగంలో
మరీ మరీ మంచిది
విద్యా కేంద్రాల స్థాపన
అందరి ఉద్ధేశ్యం కావాలి
నిరక్షరాస్యత నిర్మూలన
అక్షరం ఇస్తుంది జీవితానికి
భరోసా మరి…….?
– జి జయ