వైద్యులకు వందనాలు
ప్రాణభయము చేత పాలించి రక్షించు
దేవుడెవ్వరంటు దేవులాడ
మేము ఉన్నమంటు మెప్పించిన ట్టియీ
వైద్య బృందమునకు వందనములు
ఎంతబాధనైన వింతగా పోగొట్టి
కన్నతల్లి వోలె కరుణ జూపి
తగినమందులిచ్చి తగ్గించె బాధలు
వైద్యులార మీకు వందనములు
హృదయపూర్వకముగ ఉద్యోగము ను కోరి
కొలువునందు జేరి కోర్కె దీర
పరులసేవలందు ప్రాణాలు విడిచిన
వైద్యులార మీకు వందనములు
– కోట