మహిళా ఓటరు శక్తి
మన దేశపు మార్పుకు గుర్తు
మహిళా ఓటర్ల ఓటు హక్కు
ప్రభుత్వము పరిపాలన చేస్తే
పరిపాలనకు హక్కు ఇచ్చేది ఓటు హక్కు
రాజ్యాంగం నీకు ఇచ్చిన
ఓటుహక్కు విల్లు అయితే
సూటిగాఎక్కుపెట్టి కొట్టాలి
అక్ష రాస్యత లేకుంటే అది చేస్తుంది చేటు మొత్తానికి
సమానహక్కుకుసాటిరాదుఏది
సమానత్వపు సూత్రం
ఓటుహక్కులో చూపిస్తుంది ప్రభుత్వం
వరాలజల్లులు కురిపించినా
ఒరిగేది ఏమీ లేదన్నట్లు
ఎన్నికల తంతులా మారింది
మహిళా ఓటర్లు దేశచరిత్రను
మార్చాలనుకుంటే
గెలిచిన నాయకులు దేశం దిశను మారుస్తున్నారు
ఓటు హక్కునువజ్రాయుధంలా ఉపయోగిస్తే విధానం మారి
ప్రజాస్వామ్యం పట్టు బిగిస్తుంది
చైతన్యం చేజిక్కించుకుని
ప్రజాస్వామ్యం పరిపూర్ణత చేకూరాలంటే
నోటు హక్కుతో కాకుండా ఓటు హక్కుతో ప్రయత్నించాలి అందరూ……
_ జి జయ