మహా నగరం మాయా నగరం

మహా నగరం మాయా నగరం

 

పదహారేళ్ల సరిత మారు మూల పల్లెలో ఉంటుంది
తనకు మహా నగరం చూడాలని కోరికగా ఉండేది..
పెద్దగా చదువు రాదు..
ఆ ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో అయిదో తరగతి
వరకు చదువుకుంది అంతే!
కానీ రాజధాని నగరమంటె చాలా ఇష్టం అక్కడి జన
జీవనాన్ని గొప్పగా ఊహించుకునేది..
అక్కడి భవనాలు వాతావరణం చూడాలని చాలా
ఉబలాట పడి ఒక రోజు ఎవ్వరికీ తెలియకుండా రాజధాని నగరం బస్సెక్కేసింది..

రాజధాని వింతలు చూస్తూ వీధుల వెంట తిరిగింది
బస్సు దిగాక..
చీకటి సమయం ఆసన్నమయింది అప్పుడు భయమేసింది ఎటు వెళ్లాలి? ఎక్కడుండాలి? అని..

బిక్కు బిక్కు మంటూ ఒక చోట కూచుంది..
అప్పటి నుండి గమనిస్తున్న రంగడు దగ్గరకు వచ్చి
ఏమయింది? ఎక్కడికి వెళ్లాలి? పాప అన్నాడు..
ఆ మాత్రం మాట్లాడి నందుకే ఈ మహా నగరంలో మంచి వాళ్లు ఉన్నారనుకుని..
అంతా చెప్పేసింది..
నాకేం తెలియదు ఇలా ఈ మహా నగరం చూడాలని
ఒంటరిగా వచ్చానని..
ఇంకేముంది?
రంగడు భలేగా వాడుకున్నాడు..
నీకు మంచి ఆశ్రయం చూపిస్తాను అక్కడందరూ నీ లాంటి వాళ్లే ఉంటారు రమ్మన్నాడు..
నమ్మింది అమాయకు రాలయిన సరిత..
వెంట నడిచింది..
నేను మళ్లీ మా ఊరికి వెళ్లి పోతాను బస్సు ఎప్పుడు
ఉంటుంది? అంది అదే అమాయకంతో నడుస్తూ!
ఈ రాత్రికి బస్సులుండవు ఇప్పుడయితే నేను చెప్పిన
చోట ఉండు..
మళ్లీ రేపు వచ్చి తీసుకెళ్తా అప్పుడు బస్సెక్కిస్తాలె..
అన్నాడు రంగడు..
దాంతో చాలా సంతోషించింది సరిత..

రంగడు ఛాముండేశ్వరి వేశ్య గృహానికి తీసికెళ్లి ఆవిడతో ఏదో మాట్లాడి సరితను అక్కడ ఉంచి వెళ్లి
పోయాడు..
వాడు డబ్బులు తీసుకున్నట్టు సరితకేమీ తెలియదు
కానీ అక్కడంతా తన ఏజ్ వాళ్లే ఉండడంతో బాగానె
అనిపించింది..

తరువాత తరువాత విషయం కాస్త అర్థమయింది
ఏడ్చి గొడవ చేసింది వారి ప్రవర్తనకు..
దాంతో ఛాముండి రూంలో బంధించ మన్నది రెండు
మూడు రోజుల్లో మన దారికి వస్తుందిలే అంటూ!
రూంలో ఉంచారు..
ఒకరోజు గడిచింది..
ఆకలితో పోరాటం జరుగుతుంది అన్నం పెట్టడం లేదు వాల్లు..
ఏదో నగరం చూద్దామనుకుంటె ఇలా ఆకలి పోరాటం
చేయాల్సి వస్తుంది..
ఏం చేయడం?
మూడు రోజులయే సరికి ఇక భరించ లేక పోయింది
పారిపోయే అవకాశం లేదు..
ఇక వాల్లు చెప్పినట్టు వినక తప్పలేదు..
వింటాను అన్నం పెట్టమంది..
ఛాముండి విజయ గర్వంతో శుభ్రంగా స్నానం చేసి
అందంగా రడీ కమ్మంది..
అలాగె రడీ అయింది..
అసలే అందంగా ఉండే సరిత ఇంకా అందంగా కనిపిస్తుంది వాళ్లిచ్చిన అలంకార వస్తువులతో!
అప్పుడు అన్నం పెట్టారు..
ఆ రాత్రికి వంశీకృష్ణ ఆ రూంలోకి వచ్చాడు..
సరితకు ఎక్కడ లేని దుఖః వచ్చింది ..
ఏమయింది? అన్నాడు వంశీ కృష్ణ..
తనగురించి అంతా చెప్పింది సరిత ఏడుస్తూనె..
ఏడవకు ముందు ఏడుపు ఆపు..
అని నాతో వస్తావా? అన్నాడు ..
వస్తానంది..
వెంటనే ఛాముండితో మాట్లాడి తనతో తీసికెళ్లాడు..
సరితను హీరోయిన్ గా పెట్టి తను హీరోగా చేసాడు
తనే డైరెక్టరు నిర్మాత కూడా!
ఆ సినిమా హిట్ కావడంతో సరిత పెద్ద హీరోయిన్ అయింది ఆ వంశీకృష్ణ ఇల్లాలు కూడా అయింది..

సరిత జీవితం బాగు పడింది కానీ సరితలా ఎవరూ
ఇంట్లోంచి పారిపోయి రాకూడదు..
తనకంటె వంశీకృష్ణ దొరికాడు అధృష్టం బాగుండి కథ
సుఖాంతమయింది లేదంటె ఏమవునో!

మహానగరం అంత పని చేసింది..

– ఉమాదేవి ఎర్రం

 

0 Replies to “మహా నగరం మాయా నగరం”

  1. నగరంలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయని వార్తా పత్రికలలో చదువుతున్నాము. ఎంతైనా ఎలర్ట్ గా ఉండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *