మధ్యతరగతి మనిషి
మధ్యతరగతి మనిషికి అది ఒక మైలురాయి. అది దాటడానికి శతవిధాల ప్రయత్నిస్తూనే వుంటాడు. కానీ సమాజంలో మధ్యతరగతి మనిషికి వున్న కష్టాలు అన్ని ఇన్నీ కావు అటు తేలలేక మునిగినట్టు వుంటుంది.
ఏదో సాధించాలని ఏదో చేస్తూ ఉయ్యాల లూగే ఒక ఉయ్యాల లాంటిది. మధ్యతరగతి మనిషి సామాజిక పరిస్థితులు సంసార జీవనం రెండింటిని భుజాల మీద మోస్తూ బతుకు బండిని లాగుతూ వుండే వాడు. కోరికలను చంపుకోలేక బాధ్యతలను విస్మరించలేడు.
విధి లేని వింత జీవి మథ్యతగతి మనిషి. వుట్టిని పట్టలేనివాడు స్వర్గానికి నిచ్చెను వేసినట్టు ఊహించుకుంటూ సారూప్యత లేని ఆదాయాలతో సతమతమయ్యే ఆలోచనలతో తోకలేని పిట్ట వలె పరువూ మర్యాదలు, లాభ నష్టాలు, బాదరా బందీలు, కష్ట సుఖాలతో రైలు పట్టాలపై నడుస్తున్న రైలు ప్రయాణం లాంటిది మధ్యతరగతి మనిషి జీవితం ఆశతో ముగుస్తుంది.
– జి. జయ