కాలం నేర్పే పాఠాలు
ఆకాశాన్నంటే ఆశలు, భూమిని దాటని బ్రతుకులు.
చాలీ చాలని జీతాలు, అటూ ఇటూ కాని జీవితాలు.
అడుగడుగునా సమస్యలు, బయట పడని భావోద్వేగాలు.
కట్టిపడేసే బాధ్యతలు, వదిలిపోని ఆత్మాభిమానాలు.
నెల నెలా వేసే చిట్టీలు, నెల చివర్లో అప్పులు
దడపుట్టించే ధరాఘాతాలు, సర్దుకుపోయే మనస్తత్వాలు.
తన వారికోసం త్యాగాలు, దొరికిన దాంట్లో సర్దుబాట్లు.
తాను చేరలేని గమ్యాలు, తన పిల్లలు చేరాలని ఆరాటాలు.
ఆప్యాయతలు, అనుబంధాలు, మరపుకు రాని మనోగతాలు.
రేపటి గురించి భయాలు, మనుగడ కోసం పోరాటాలు.
కాలం నేర్పే పాఠాలు, అంతే లేని ఆలోచనలు.
ఎడారిలో ఎండమావులు,
ఇవే మధ్యతరగతి మనిషి లక్షణాలు.
– రవి పీసపాటి