మాటల మంటలు
మౌనాలు మలుపులు
మనసుకు తాళాలు
చిక్కుముడులు పీటముడులు
బంధాలు అనుబంధాలు
ఆట ముగుస్తుందని
కన్నార్పలేము
కనుల నీటిచెమ్మ
ఆశకు నీటి చెలమ
కలతలు కష్టాలు
యుగళగీతాలు
పలకరింపుల వానే
ఎడారికోయిల
ఎదమీటే రాగాలు
ఎదపంచే మోహాలు
ఎడబాటు ఆవేశాలు
మనసుకు ఆదేశాలు
కలలను మోసేవాడు
కలతలు తీర్చుతాడు
కాలం చెట్టుకు
పాదులు తీయగలిగేవాడెవ్వడు
– సి.యస్.రాంబాబు