మార్పు
ఇంకా ఎన్ని ఏళ్లు దాటిన వారిలో
మార్పు వస్తుందని నువ్వు ఎలా
అనుకుంటున్నావు నిన్ను వాళ్ళకి
నచ్చినట్టు ఇబ్బంది పెడుతున్నారు..
నీలో ఎప్పుడు మార్పు వస్తుందో
నాకు మాత్రం అర్దం కావడం లేదు..
వాళ్ళలో మార్పు రావాలంటే ముందు
నీలో చైతన్యం రావాలి అని నేను
తనకి చెప్పాను..
ఒక రోజు తనలో చైతన్యం చూసి
నాకు చాలా ఆశ్చర్యం కలిగింది..
తనలో చైతన్యం రావడం కోసం
నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను..
తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి
నాకు ముందే బుద్ది చెప్పింది..
- మాధవి కాళ్ల