నూతన సంవత్సరం

నూతన సంవత్సరం

రోజులు మారుతున్నాయి…
కాలం ఆగకుండా పరుగెత్తుతూ ఉంది.. నిమిషాలు గంటలు అయ్యాయి గంటలు రోజులు అయ్యాయి….

రోజులు కాస్త సంవత్సరం కూడా అయ్యింది…
కానీ మన జీవితాల్లో మార్పు రాలేదు… 

ఈ సంవత్సరం పోతుంది అని బాధ పడలా.. ఇంకో సంవత్సరం వస్తుందని సంతోషించాలో.. తెలియడం లేదు…

ఒక్కో రోజు కాలం ఒక్కో పాఠం నేర్పుతుంది. ఈ జీవన ప్రయాణం లో..
అలాంటి ఒక సంవత్సరం ఎన్ని నేర్పించి ఉంటుంది… ఎన్ని తీపి గురుతులు… ఎన్ని చేదు అనుభవాలు…
ఎన్నో ఎన్నెన్నో ఇచ్చింది…
అన్నిటినీ ఈ సంవత్సరం చివరి రోజు అయ్యో వెళ్ళిపోతుంది…. మళ్ళీ ఆ జ్ఞాపకాలు తిరిగి రాలేవే….

చేదు అనుభవాలు అయ్యో అలా చేశామే… ఆ రోజు ఇలా జరిగిందే అని ఈ రోజు బాధపడిన…

సంవత్సరం అంకె మారుతుంది క్యాలెండర్ లో అంతే ఇంకా అంతకు మించి జరిగేది ఏమి లేదు…

కానీ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఎంటి అంటే…

ఈ సంవత్సరం పోయినా…
మరుసటి రోజు కొత్త సంవత్సరం వస్తుంది..

అన్నిటినీ అంటే.. మంచి అయిన చెడు అయిన..
ఈరోజే తెలుసుకుంటే..
కొత్త సంవత్సరం లో అంటే రేపు.. మార్చుకోవచ్చు..

కానీ ఈ సంవత్సరాలు. ఇలాగే కొనసాగితే…. నీ జీవిత కాలం వరకు గడిస్తే.. నువు పోయే చివరి నిమిషం లో గుర్తు వచ్చిన…

కన్నీటితో కన్ను మూయలి తప్ప…. తిరిగి పోందలేవు… చివరి నిమిషంలో నీ ఆఖరి క్షణంలో…

ఇక ఈ సంవత్సరం లో జరిగిన చెడు నీ మర్చిపోయి… మనకు జరిగిన మంచిని…

మనలోని మంచిని మూట కట్టుకుని నలుగురికి సంతోషాన్ని పంచుతూ..

ఆ నలుగురి నవ్వుల్లో మన సంతోషం చూడాలని కోరుకుంటూ…

కొత్త సంవత్సరం లోకి అడుగు పెడదాం….

నూతన సంవత్సరం శుభాకాంక్షలు..

– వనీత రెడ్డీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *