మారిన విలువలు
మనుషుల మనస్తత్వాలు
కాలానుగుణంగా మారవలసి ఉంటుంది.
దానిలో భాగంగా నే ప్రత్యేక సందర్భాన్ని బట్టి
సమయాన్ని బట్టి విలువలుమారుతూ ఉంటాయి.
ఆచరణ సాధ్యంకానిమాటలు
ఆదర్శంగా లేని జీవితాలు
అందుకోలేని దూరాలు
ప్రయోజనం లేని పనులు
గౌరవించని మనుషులు
ప్రాధాన్యత లేని అంశాలు
ఆయోమయపు ఆలోచనలు
పోటీలు పడే సమాజం
నీతి లేని నిజాయితీ
స్వార్దాల సంపదలు
దయనీయమైన పరిస్థితులు
డబ్బు వెంట పరుగెత్తడం
నైతిక విలువలు లేని సమాజం
మారిన వ్యక్తిత్వాలు
మనుగడ లేని విధానాలు
మంట గలుస్తున్న
మానవీయత అన్నీ కలిసి
మారిన విలువలు మారని
మనుషులుగా తయారు
చేసినవి మనిషిని…….?
– జి జయ