మా అమ్మ కధ
మా అమ్మగారి పేరు లక్ష్మీ బసవపూర్ణమ్మ గారు. నా కలం పేరు బసవపూర్ణమ్మ గారి అబ్బాయి. అలా ఎందుకు పెట్టుకున్నానంటే అప్పుడెప్పుడో గౌతమీపుత్ర శాతకర్ణి తన అమ్మగారి పేరు తన పేరు ముందుంచుకుని విశాల సామ్రాజ్యాన్ని స్ధాపించి తన మాతృమూర్తి పేరును దశదిశలా వ్యాపింపచేసాడు.అలాగే నేను నా రచనల ద్వారా మా అమ్మ పేరునుదశదిశలా వ్యాపింపచేయాలి అనేది నా సంకల్పం. నాకుమొదటి గురువు నా అమ్మే.చిన్నప్పటి నుంచి ఏది మంచో-ఏది చెడో చెపుతూ ఉండేది. నీతి కధలు చెపుతూనన్ను నిద్రపుచ్చేది. నాకు
ఒకోసారి అమ్మ ఒక స్నేహితురాలిగా అనిపించేది.
మరోసారి పెద్దక్కలా కనిపించేది. తప్పు చేసినప్పుడు దండించేది. ఆ దండనలో ఒక ప్రేమ భావనఉండేది. అలాగే నేను ఏదైనా మంచి పని చేస్తే అభినందించేది. నేను గొప్ప
పని ఏదైనా చేస్తే అభినందించేది. నా జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. అసలు ఏమి జరిగిందంటే నేను హైదరాబాదు నగరంలో ఉద్యోగం చేస్తుండేవాడిని.
నా భార్య కూడా ఉద్యోగం చేస్తుండేది. నాకు ఇద్దరుపిల్లలు. ఒక పాప,బాబుమా తోనే ఉండేవారు.
అమ్మ మచిలీపట్నంలోఉండేది. ఆవిడ జీవితభీమా సంస్ధలో ఉద్యోగంచేసి రిటైర్ అయ్యారు.మా నాన్నగారు చనిపోయినతర్వాత అమ్మ ఒంటరిగా ఉండేది. ఒక రాత్రి అమ్మ నాకు
ఫోన్ చేసింది. “ఒంటరిగా అనిపిస్తోంది. ఒకసారి ఇంటికివస్తావా”అంది. అప్పుడు రాత్రితొమ్మిది అయ్యింది. బస్సుటికెట్లు దొరకలేదు. వెంటనేనా టూ వీలర్ తీసుకుని
మచిలీపట్నం వెళ్ళాను. ఎలావెళ్ళానో నాకే తెలియదు. ఆ డిసంబర్ 25వ తారీఖు. మరుసటి రోజు క్రిసమస్.
ఆ రాత్రి ప్రయాణంలో చలికినా వేళ్ళు కొంకర్లు పోయాయి.అయినా సరే అమ్మ పిలిచిందికాబట్టి వెళ్ళాలి. మనసులోఅదే భావన ఉంది. మధ్యలోసూర్యాపేటలో ఒకసారి మాత్రమే ఆగాను. ఒకటే దూకుడు. గంటకు ఎనభైకిలోమీటర్ల వేగంతో వెళ్ళాను.చల్లటి గాలి ముఖానికి తగులుతోంది. ఉదయం ఐదున్నరకు మచిలీపట్నంచేరుకున్నాను. నేను బండి
మీద వస్తానని అమ్మ అనుకోలేదు. బస్సు మీద వస్తానని మాత్రమే అనుకుంది.
నేను బండిమీద రావటంచూసి”ఏమిటి ఈ పని. నీకుఏమైనా పిచ్చా. బండిమీదవచ్చేసావు. దారిలో ఏమైనాజరిగితే.”అని కోపంగా అంది.ఆ కోపంలో కూడా నాకుఅమ్మ ప్రేమ కనపడింది.నేను స్నానం చేసి వచ్చేటప్పటికి అమ్మ పెసరట్లు వేయసాగింది. అమ్మ పెసరట్ల పిండి రెండు గిన్నెల్లో పెట్టి ఫ్రిజ్ లోపల ఉంచింది. పెసరట్ల పిండి ఎప్పటికప్పుడు రుబ్బుకుని వేసుకుంటే బాగుంటాయి. కానీ అమ్మముందే పిండి రుబ్బుకునిఫ్రిజ్ లోపల పెట్టింది. పెసరట్టువేసి నాకు ప్లేటులో పెట్టి ఇచ్చింది. చిన్న గిన్నెలోఉన్న పెసరట్టు పిండిన
చట్నీ అనుకుని వేసి ఇచ్చింది.
నేను గమనించాను కానీ అమ్మ బాధపడుతుంది అని మౌనంగా తినేసాను. ఆవిడకు కళ్ళు సరిగా కనిపించటం లేదు. ఆ తర్వాత అమ్మకు విషయం అర్ధం అయ్యింది. “పచ్చి పిండి ఎలా తినేసావురా. నాకు చెప్పొద్దూ.ఈ భూమి మీద ఎవరైనాపెసరట్లు పిండి పచ్చిది తినగలరా.” అని కోప్పడింది.నా అమ్మ ఏమి వండిపెట్టినాఅది నాకు అమృతమే. ఏమిటీ ఈ రచయితగారు తన అమ్మగురించి గొప్పగా వ్రాస్తున్నారు.
అని మీరు అనుకోవచ్చు. అమ్మను మించిన దైవంఉండదు కదా. మా అమ్మఇప్పుడు లేదని అంటారు. కానీ ఆమె నా మనసులోనే ఉంది.
-వెంకట భానుప్రసాద్ చలసాని