లేఖ
పరువు లేఖ: ఓ తండ్రికి కూతురు రాసిన లేఖ…
నాన్న నన్ను గుండెల మీద ఎత్తుకుని ఆడించావు..
అల్లారు ముద్దుగా చూసుకున్నావు..
నన్ను నీ ప్రాణంగా చూసుకున్నావు…
నీకు అన్నీ నేనే అన్నావు..
నాకేం కావాలో అన్నీ నాకంటే ముందుగా నువ్వే తెలుసుకొని
నాకు ఏ లోటూ లేకుండా చూసుకున్నావు…
చిన్నప్పటి నుండి నాకేం కావాలో అన్ని తెలుసుకుని..
నాకు నచ్చినవి అన్నీ ఇచ్చి..
నన్ను ఓ స్థాయిలో ఉంచి..
నా కూతురు బంగారం…
తను ఏ పని చేసినా ఆలోచించి
చేస్తాది అని, నన్ను సమర్దించావు…
నా ప్రతి ఆనందం లో తోడుగా ఉన్నావు..
కానీ నేడు నేను ప్రేమించాను నాన్నా … అంటే … ఎందుకు ఒప్పుకోవడం లేదు ..
అన్ని ఆలోచించే నేను… నా జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటపపుడు మాత్రం ఆలోచించకుండా ఉంటానా?
ఇది ఎందుకు అర్దం కాదు మీ పెద్దలకి అన్ని విధాలుగా తగిన వాడే కదా…
మీరు ఇలాంటి గుణ గణాలు ఉన్న వాడినే కదా చూస్తారు…
మీకు అవకాశం ఇవ్వలేదనా..?
మీ మాట వినడం లేదనా…?
నన్ను నీ స్థానం లో ఉండి చూసుకుంటున్నాడు…
నీ పక్కన ఉన్నపుడు నాకు ఎంత ధైర్యంగా ఉంటుందో..
తనతో ఉన్నపుడు కూడా అలాగే ఉంటుంది… అని చెప్పాను….
అన్ని విన్న మీరు… ఒక్క కులం… దగ్గర ఆగిపోయారు..
పరువు పోతుంది అన్నారు…
ప్రాణాల కన్నా పరువు ముఖ్యం.. అన్నారు…
నాన్న… నిన్ను బాధ పెట్టే పని నేను ఎపుడూ చేయలేను..
ఇపుడు కూడా చేయను…
అలా అని నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాడిని వదిలి.. ఇంకొకరితో జీవితాన్ని పంచుకోలేను…
వాడు నాతో లేదు అనే బాధ నన్ను ఒక్కో క్షణం.. నరకం లోకి తోస్తుంది…
ఇలా చస్తూ బ్రతకడం కన్నా.. ఒకేసారి చనిపోవడం మంచింది…
నా ప్రేమ ఎలాగో మీకు అర్దం కాదు..
వాడి ప్రేమను పొందలేని ఈ జీవితం వ్యర్థం…
నా తండ్రికి నచ్చని పని చేసిన నేను… ఇక ఈ జన్మకు సెలవు..
______
ఇలా తల్లి తండ్రులు…. తమ పెద్దరికం తో తమ పరువు ముఖ్యం అంటూ పిల్లల ప్రేమను దిక్కరిస్తూ ప్రాణాలను బలి కోరుతున్న తల్లితండ్రులు ఎందరో…
– వనీత రెడ్డీ