కురిసే మేఘం
నీలాకాశంలో గున్న ఏనుగుల సమూహం ఒకచోట చేరినట్లు…
లోకంలోని నిశీధులన్నీ ఒకచోట సమావేసమైనట్లు…
అమావాస్య రాత్రులన్నీ కలసికట్టుగా వచ్చినట్లు…
కళలు తప్పిన చంద్రుడు ఆ మేఘాల మాటున దాగినట్లు….
నల్లని చీకట్టు కమ్ముకుని చీకట్లు వ్యాపించగా…..
చల్లని గాలులు సన్నాయి రాగమాలపిస్తున్నట్లు…
వృక్షాలన్నీ కచేరిమేళం పెట్టుకున్నట్లు…
లోకంలోని ఓంకార నాదమంతా వ్యాపించినట్లు…
పక్షులన్నీ గూళ్ళు చేరి సంగీతవిభావరి నిర్వహిస్తున్నట్లు…
హోరెత్తిన గాలులన్నీ ప్రళయమారుతంలా వీస్తుండగా….
ఆకాశం హర్షంతో వర్షిస్తున్నట్లు జల్లులు కురిపిస్తుండగా…
ఆకాశమేమైనా చిల్లుపడిందాన్నట్లు….
ఆగి ఆగి కురుస్తున్నది కుంభవృష్టి వచ్చిపడినట్లు….
ఆగక కన్నీరు కారుస్తున్నది ఆ నీలాకాశమన్నట్లు….
కరగిన మేఘాలు చిటపట చినుకులను వర్షిస్తుండగా….
స్తంభించెను జనజీవనమంతా….
ఇండ్లకు పరిమితమాయెను ప్రజలంతా…
కల్లోలాన చిక్కుకునెను సామాన్యులంతా…
ప్రకృతి ప్రకోపమన్నట్లున్నది ఈ స్థితి అంతా…
గత నాలుగు రోజుల వాతావరణ చిత్రమిదంతా….
మనసంతా పరవశం నింపిన మధురోహలకి అక్షర రూపమిది….
– ఉమామహేశ్వరి యాళ్ళ