కుక్క బతుకు

కుక్క బతుకు

అబ్బా ఎంత బాగుందో, ఇంత అందమైన దాన్ని చూసి ఎన్ని రోజులు అయ్యింది. ఇలాంటి వాళ్ళు మనకు ఎందుకు తారస పడరో, ఇలాంటి అందగత్తెలు అవారా గాళ్ళకే పడతారు కాబోలు, అబ్బబ్బా ఎన్నెన్ని అందాలు, ఎంతో శ్రద్ధగా పెంచినట్టు, ఎంతో ముద్దుగా పెంచినట్టు ఉన్నాయి.

ఇంత శ్రద్ద తీసుకొని పెంచిన అందాలను ఎవడికి ఇస్తారో కానీ ఎంత ముద్దుగా ఉన్నారో, అరే ఇదొక్కటే అనుకుంటే అదేంటి ఎన్నో సీతాకోక చిలుకలు గుంపులుగా వస్తున్నాయి. ఇన్నాళ్లు ఎక్కడ దాక్కున్నాయో, ఎక్కడ ఉన్నాయో అహ నా జన్మ ధన్యం అయ్యింది.

ఇన్నాళ్లు ఆ మిడిల్ క్లాస్ కాలనీ లో అంతా కప్పుకుని ఉన్న అందాలను ఆ కప్పుకున్న చాటు యెత్తులెంత ఉన్నాయో ఊహిస్తూ బ్రతికేసాను. కానీ ఇప్పుడు ఇలా సగం సగం బట్టల్లో కనిపిస్తున్న ఇన్ని అందాలను చూస్తుంటే తట్టుకోలేక పోతున్నాను.

ఇన్ని అందాలు అహ నా రెండు కళ్ళూ ఎంత పుణ్యం చేసుకున్నాయి. ఈరోజు నా పంట పండినట్టే, ఇంతటి అందాలని అసలు చూస్తాను అని అసలు అనుకోలేదు. ఆహా ఏమి నా భాగ్యం.

అబ్బబ్బా జీన్స్ లో, టాప్ లెస్, స్లీవ్ లెస్ లో, స్కర్ట్ లో, చిన్న చెడ్డిల్లో ఎంత బాగున్నాయో అందాలు. అబ్బా ఏమి పిక్కలు రా బాబు అబ్బో అందాలను వర్ణించడం నాకు రావడం లేదు.

కానీ ఇలాంటి అందాలను చూసే కాబోలు పెద్ద పెద్ద కవులు, పండితులు అంతగా వర్ణించి రాశారు.. ప్రభంద నాయికలు అంటూ వర్ణించారు. ఓహో ఒక్కో దాన్ని చూస్తుంటే నాకు ఇక్కడే ఏదో చేయాలి అనిపిస్తుంది.

ఇందుకు కాబోలు రేప్ లు మర్డర్ లు జరుగుతాయి. ఆహా ఏమి అందం నాకు ఒక్క సారి ఇలాంటి అందగత్తె దొరికితే ఎంత బాగుండేది.

నా కోరిక తీర్చుకుని ఉండే వాడిని. ఒక్కసారి అంటే ఒకే ఒక్కసారి ఇలాంటి అందగత్తె దొరికితే నా పంట పండినట్టే ఇంతటి అందాలని అనుభవించే రాత కూడా ఉండాలి. ఇవ్వన్నీ అందాలు ఎవరికి రాసి పెట్టి ఉన్నాయో..

ఈ అందమైన అమ్మాయిలను ఎవడు అనుభవిస్తాడో కానీ వాడి జన్మ ధన్యం అయినట్టే. కళ్ళు చెదిరి పోతున్నాయి ఒక్కొక్కరిలో ఒక్కో అందం. ఒక్కొక్కరిలో ఒక్కో అవయవాలు పొందిగ్గా, తీరిగ్గా మలిచినట్టు ఉన్నాయి. వీటికే కదూ రాజ్యాలు పోయాయి, యుద్దాలు జరిగాయి.

నా సామిరంగా ఒక్కసారి దగ్గరికి వెళ్ళి వాళ్లను ఎలాగైనా ముట్టుకోవాలి. ఒక్కసారి తాకితే నా కోరిక తిరినట్టే అహ అదిగో అక్కడ నిల్చుంది పొడుగు కాళ్ళ సుందరి. తన దగ్గరికి వెళ్ళి ముట్టుకుని వస్తా. ఎలా ఉంటుందో అంత అందమైన దాన్ని ముట్టుకుంటే కనీసం తృప్తి అయినా మిగులుతుంది.

ఆహా వచ్చాను దగ్గరగా వచ్చాను. ఎంత బాగుందో అబ్బో ఏమందం, ఏమందం. అబ్బో దగ్గరగా చూస్తుంటే మతి పోతుంది. అబ్బా ఒక్కసారి ముట్టుకుంటే వెళ్తున్న దగ్గరగా వెళ్తున్నా, అహ అబ్బా ఏముంది…

**********

ఛీ ఏంటో జీవితం దగ్గరికి రానివ్వరు ముట్టుకో నివ్వరు. ముట్టుకుంటే పట్టుకుంటే దాని సొమ్మేమన్నా పోతుందా, దీనమ్మ అందరూ ఇలాగే ఉంటారేమో… కొంచం ముడితే దాని అందం ఏమన్నా తరిగి పోతుంది అనుకుందో ఏమో, ఛీ ఇలాంటి వాళ్లకు జాలీ, దయ ఉండవు.

అయినా అదొక్కటే ఉందా బోలెడు ఉన్నారు. ఇది కాకపోతే ఇంకొకటి మనమేమన్నా తక్కువా? మళ్ళీ రేపు రాక పోతారా మళ్లీ నాకు దొరకక పోతారా, ఎలాగైనా ఈ సారి నా కోరిక తీర్చుకోవాలి.

దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి. గట్టిగా కొరకాలి. ఈ సారి కండలు ఉడెలా కొరికి పెడతా… మనం అంటే భయపడాలి, భయపడేలా చేస్తా మనం వస్తున్నాం అంటేనే గజగజ వణికి పోయేలా చేస్తా…. ఏమనుకుంటున్నారో అసలు హా…

ఇన్ని అందాలు అనుభవించే సుఖం ఎప్పుడు వస్తుందో, దీనమ్మ జీవితం ఇలాంటి వాళ్లు మనకు పడరు ఎందుకో… కానీ ఈ సారి ఖచ్చితంగా దాన్ని అనుభవించే తీరుతా…

అప్పటికి నా ఒళ్లు బాగా శుభ్రం చేసుకుంటా, నన్ను చూసి, నా కండలు చూసి అహ అనాలి. మైమరచి పోవాలి…. అనుకుంటూ తన నాలికతో తన శరీరాన్ని నాక్కుంటూ… తన జన్మ మారినా బుద్ది పోనిచ్చుకొని ఆ మగ కుక్క అలా పడుకుండి పోయింది..

-భవ్య చారు

0 Replies to “కుక్క బతుకు”

  1. ఇలా మగాళ్లే కాదు ఆడ వాళ్ళు కూడా ఉన్నారు చాలా బాగా రాసారు కుదిరితే ఆ కోణం కూడ రాయండి… 👍

  2. చాలా బాగుంది చాలా బాగా రాసారు ఏంటి కాలంలో ఆడ మగ ఇద్దరిలో ఇలాంటి ఆ నైతిక చర్యలు చాలా మటుకు సహజమే బాగుంది మీ కథ…. 👌👍💐

  3. చక్కని కథనం. చాలా ఆసక్తికరంగా రాసారు. చివరివరకు తెలియలేదు అది కుక్క అనుకుంటుంది అని. పదాల విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకోండి. పదునైన పదాలను వాడితే కథనం ఇంకాస్త ఆసక్తి కలిగిస్తుంది. వేసిన పదాలను పదే పదే రిపీట్ కాకుండా చూసుకోండి. మంచి భవిష్యత్తు ఉంది మీకు.

  4. కొన్ని బుద్ధులు ఏ జన్మలో, ఏ జంతువుగా పుట్టిన కూడా మారదు. అలాగే ఎక్కువుగా మగ కుక్కలు బయట పడతాయి. ఆడ కుక్కలు పడవు అంతే తేడా…. లాస్ట్ లో కుక్క అని అప్పటివరకు అనుకోలేదు😅. చాలా బాగుంది భవ్య గారు నైస్ 👌

  5. కథ చాలా బావుంది భవ్యా. కుక్కలు కూడా ఇలా ఆలోచిస్తాయా అని నువ్వు వచ్చింది

  6. కుక్క బతుకంటే ఏమో అనుకున్నాను…స్టోరీ చదువుతున్నంత రాశారో కాసేపు అర్థం కాలేదు. టైటిల్ కి స్టోరీ కి సంబంధం చివర్లో తెలిసింది. కథనం బాగుంది.కానీ అందరూ మగాళ్ళని అనకుండా కొందరిని అని రాసుంటే బాగుండేది….
    Any How it’s a good writing…

    కొంత మంది మగాళ్ళ మార్పుకు కారణమవ్వాలి ఈ కథ.

  7. Super..medam . చాలా చాలా చాలా బాగుంది మేడం..🔪🔪🔪🔪🖊️🖊️🖊️🖊️💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *