దేవేంద్రుని అర్థ సింహాసనం గురించి ధర్మరాజు చెప్పిన కారణం
ఇది చాలా గొప్ప ప్రశ్న. నేను కొంత ప్రయత్నిస్తా. అర్జునుడు అరణ్య వాసములో దేవేంద్రుని దగ్గరకు సశరీరంగా వెళ్ళాడు. అప్పుడే ఊర్వశి కోపానికి శాపానికి గురయ్యాడు. దేవేంద్రుడు కూడా దీన్ని గురించి ఏమీ అనలేదు.
అయితే అర్జునుడు, శ్రీకృష్ణుని తో కలిసి స్వర్గం కంటే ఎంతో దుర్లభమైన వైకుంఠానికి సశరీరం గానే వెళ్లి శ్రీమన్నారాయణ మూర్తిని దర్శనం చేసుకుని వచ్చాడు.అంతకు ముందొక సారి అభిమన్యుని మరణించిన రోజు శ్రీకృష్ణుడు, అర్జునుని స్వర్గానికి తీసుకొని వెళ్ళాడు.
అయితే ఇవన్నీ తాత్కాలికముగా వెళ్లి, మళ్ళీ వెనుకకు వచ్చి తిరిగి మానవ శరీరంతో భూలోకంలో జీవించిన చిన్న ప్రయాణాలు. దివ్య లోకాలకు వెళ్లి అక్కడ శాశ్వత నివాసానికి ఉద్దేశించినది కాదు.
ఇక మహా ప్రస్థానం చేసినప్పుడు ఆయన భీమునికంటే ముందే పడిపోయాడు.ఇదికాక అనేక లక్షలమందిని సంహ రించాడు. కొన్ని అన్యాయాలు కూడా యుద్ధం లో చేసాడు.
పరమాత్మ శ్రీకృష్ణుడు కూడా మానవ శరీరాన్ని ఇక్కడ వదిలేసి మాత్రమే దివ్య లోకానికి వెళ్ళాడు.
అయితే ఒక్క ధర్మరాజుకు వున్న ధర్మ దీక్షకు మెచ్చి యమ ధర్మరాజు అనుగ్రహం పొంది సశరీరముగా రమ్మని ఆహ్వానం పొందాడు.అయినా ఆయన కూడా అక్కడ శాశ్వత నివాసానికి ముందు అక్కడ వుండే దేవ లోక నదిలో స్నానం చేసి దివ్య శరీరం పొందాడు.
మానవ శరీరాలు దివ్యలోక శాశ్వత నివాసానికి పనికి వచ్చేవి కాదు