కొత్త పెళ్ళికొడుకు
ఊరంతా దీపావళి పండగ చేసుకుంటుంటే పోలిసు
రామస్వామి మాత్రం డ్యూటీ
చేస్తున్నాడు. అతనికి ఈ
మధ్యే పెళ్ళి అయ్యింది.
ఈ మధ్యే నైట్ పెట్రోలింగ్
పోలీసుగా డ్యూటీ పడింది.
రాత్రిపూట ఇంట్లో భార్య కాంతం ఒంటరిగా
ఉంటోంది. అలా ఆమెను
వదిలి డ్యూటీకి రావటం
రామస్వామికి ఇబ్బందిగా
ఉంది. ఎలాగైనా నైటు
డ్యూటీ కాన్సిల్ చేయించుకుని
పగలు డ్యూటీ వేయించుకోవాలి అని అనుకున్నాడు. అందుకు
ఒక ప్లాన్ వేసాడు. నైటు
పోలీసు వ్యానులో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు చిన్నగా నిద్ర పోతున్నట్లు నటించాడు.
అతను డ్రైవర్ పక్కన
కూర్చున్నాడు. అలా నిద్రపోతున్నట్లు నటిస్తూ “కాంతం, నీ వాలు జడ
చాలా బాగుంది. “అని
కలవరించటం మొదలు పెట్టాడు. అప్పుడు వ్యానులో
ఉన్న ఎస్. ఐ గారు” ఈ కాంతం
ఎవరు. ఇతను ఎందుకు ఇలా
కలవరిస్తున్నాడు.” అని పక్కన
ఉన్న మరో కానిస్టేబుల్ ను అడిగాడు. అప్పుడు అతను
“కాంతం రామస్వామికి భార్య సార్. పాపం రామస్వామికి
ఈ మధ్యనే పెళ్ళైంది. అందుకే
నైటు డ్యూటీ అంటే ఇబ్బంది
పడుతున్నాడు.” అన్నాడు.
ఎస్సై మంచి వాడు. వెంటనే
రామస్వామికి డే డ్యూటీ
వేశాడు. తన ప్లాన్ సక్సస్
అయినందుకు రామస్వామి
ఆనందించాడు. భార్యతో
గడిపే మధుర క్షణాలకోసం
ఎదురుచూడసాగాడు.
-వెంకట భానుప్రసాద్ చలసాని