కల్తీ మనుషులు
ఒంటికాలిపై నడచు
కలియుగమ్మున ధర్మం
మూడు కాళ్ళు లేని
చతుష్పాద జీవిలా
మూడు యుగములు
గడచి తన నెత్తిపైపడ
ధర్మ సంకటమున కలి
డోలలాడుచుండె
ధర్మమొదిలి జనులు
తిరుగాడు చుండ
రాజ్యమేలె కల్తి
మనుషులందు
బాగ చెయ్యి తిరిగి
నిపుణునిగా మారి
కల్తీ మనిషిగ తాను
మారె నిపుడు
ధర్మమార్గము వీడి
డబ్బు కూడబెట్టి
అవినీతి డబ్బుతో
చేపట్టె అధికారము
నీతి సూత్రములు చెప్ప
పెడచెవిన పెట్టి
ఎడా పెడా వాయించి
పోషించే అవినీతి
కల్తీ లేని మనిషికై
వెతుకాడ మనము
ముందు చూసుకొనవలె
అద్దమున ముఖము
(రమణ బొమ్మకంటి)