కల్తీ
ఉన్నట్టుండి ఉత్తరాంధ్రలో లెక్కకు మించి మరణాలు,
దారి పొడవునా దక్షిణాంధ్రలో దిక్కులేని చావులు.
విచారణలు అన్వేషణలు మొదలయ్యాయి కానీ ఆ అంతుచిక్కని రహస్యమేమిటో, ఈ దారుణాలకు కారణం ఎవరో
అర్థం కాక రక్షకభటులు,
దిక్కుతోచక ప్రభుత్వాలు.
ఈ దారుణాలు జరిగింది ఒకే విషయం మీద వివిధ ప్రదేశాల్లో జరిగిన సమావేశాల్లో,
ఆ విషయం కల్తీ ఆహారం.
వ్యవసాయం మీద, ప్రకృతి మీద ఉన్నత విద్యను అభ్యసించిన ఓ యువ శాస్త్రవేత్త ఈ దారుణాలకు కారణం తన తెలివితేటలతో ఎవరికీ అనుమానం రాకుండా తన సందర్శించిన ఉపన్యాసం ఇచ్చిన సమావేశంలో అందరూ తినే ఆహారంలో విషం కలిపి ప్రతి చోట ఇలా అందరి ప్రాణాలు పోవడానికి కారణమవుతాడు.
దానికి అతను చెప్పిన కారణం
క్లోజప్, కోల్గేట్ అంటూ మనం పళ్ళు తోముతున్నాం,
చివరికి ఒక పండు కొరక లేక పళ్ళు రాలుతున్నాయి.
పూరి దోశ ఇడ్లీ అంటూ అల్పాహారం తీసుకుంటున్నాం,
ఎంత కీర్తి సాధించిన చివరికి అజీర్తి పాలవుతున్నాం.
మార్కెట్లో ధరలు పెరిగి అప్పుల పాలవుతున్నాం,
చివరికి ఆ ధరలు పెంచిన ధన్యులనే అందలము ఎక్కిస్తున్నాం.
గోళ్ళకు వేయాల్సిన పాలిష్ మనం తినే ధాన్యానికి వేస్తున్నాం,
చివరికి షుగర్ బీపీ అంటూ ఆసుపత్రులు పాలవుతున్నాం.
స్లోగా పోయే సోసో బతకులు ఉంటే ఎంత,
పోతే ఎంత అంటూ,
తనం కుటుంబం ఈ కల్తీ ఆహారం తీనడం వల్లే
భయంకరమైన రోగాలతో పోయారంటూ వాపోయాడు హంతకుడు..
అల్లోపతి మీద అసహ్యం యేసి,మాట వినని సమాజం మీద అసహనం కల్గి ఇదంతా చేశానని చివరికి తుపాకీ తస్కరించి
తనను తాను హత్య చేసుకుంటాడు..
-అశోక్