కళ్ళున్న గుడ్డిది లోకం
కళ్ళతో చూస్తారు
మనసుతో చూడలేరు
చిన్న , పెద్ద తేడా లేక
వావి , వరుస గౌరవం లేక
తల్లిదండ్రులను పట్టించుకోక
ఆశ్రమాలలో పడేసే రోజులు
కన్నీరు పెడదాము అనుకుంటే
వేళ్ళతో కళ్ళు పొడిచే రోజులు
సహాయం చేద్దాం అనుకుంటే
శార్దూలంల తిరగబడే రోజులు
రోజులు మారాయి
కలతలు పెరిగాయి
నమ్మకద్రోహం ఒకవైపు
నమ్మిన అవమానం ఒక వైపు
ఆటపాటలతో ఆకతాయితనం మరోవైపు
లంచం తీసుకోవడం మరోవైపు
కనిపిస్తున్నాయి మన సమాజం ముందు
అందుకే కళ్ళు ఉన్న లోకం గుడ్డిది
మనసు ఉన్న మనిషి తీరు చెడ్డది
కాకుంటే నువ్వే గొప్ప
కళ్ళు ఉన్న లోకం గుడ్డుదని చెప్పు
జాగ్రత్తగా మెలిగి సమాజంలో మసులుతూ ఉండు
-యడ్ల శ్రీనివాసరావు