కలిసి ఉంటే కలదు సుఖం
మనసులోని బాధలను
మితృలతో పంచుకో.
అందరితో కలుస్తూ ఉంటే
మనసుకు హాయి కదా.
ఒంటరిగా ఉండొద్దు నేస్తం.
నీవు సంఘజీవివి మిత్రమా.
భారాన్ని గుండెలో దాచేస్తే
గుండె పగిలి పోతుంది.
శ్వాస ఆగి పోతుంది.
మంచి రచనలు చదువు.
మంచి మితృలను కలువు
సుఖముగా జీవించు.
-వెంకట భానుప్రసాద్ చలసాని