అంతర్భాగం
అంతర్ముఖం మనిషి అంతర్భాగం అయితే
అత్యున్నత జీవితమే
అంతర్ముఖానికి నీవు చూసిన
అద్దమైతే కఠినమే కానీ కష్టం కాదు
బాహ్య ప్రపంచపు అందాలలో
బందీలై అంతర్ముఖాన్ని అడగడం మాని
నిశ్చలమైన మనసు అనవసరపు ఆలోచనల ఆలవాలం కాకుండా
దృష్టి కోణాన్ని మార్చుకొని
తాత్కాలిక సంతోషాల కోసమై
మనసును తాకట్టు పెట్టక
అసూయ ద్వేషాల అంత చూసి
సమయాన్ని సందర్భచితంగా
ఖర్చు చేస్తే
అనుభవాల సారాన్ని
ప్రేరణల ప్రతిఫలాన్ని
వాస్తవికతలను వడ్డించుకుని
ప్రతికూలతలను పక్కనపెట్టి
అంతర్ముఖానికి తరచి చూస్తే
ఆది దేవుడవు నీవే సుమా…
-జి జయ