కావాలోయ్.. కావాలోయ్..
నందనమీ జగతి
ఆనందమే ప్రగతి
మార్చవోయి నీగతి
లేకుంటే అధోగతి
నీ మనసుకు అధిపతి
నీవేనోయ్ సేనాపతి
గిరిగీసిన బతుకుల్లో
కావాలొక కులపతి
పదవోయ్ పదపదవోయ్
ధైర్యముగా సాగాలోయ్
నీ దారిని నీవేవేసి
గమ్యాన్ని చేరాలోయ్
చీదరింపులుంటాయి
ఛీత్కారాలుంటాయి
చింతలనే చిమ్మేస్తూ
చకచకమని కదలవోయ్
చేయిచేయి కలుపుతు
అందరిని కలపవోయ్
అలసటను తరిమేసే
ఇంధనమే నీవేనోయ్
– సి. యస్. రాంబాబు