జన విజ్ఞాన వేదికవై
లోకం భయపెట్టని వెలుగులకై ప్రయత్నం
ఒకరికై ఆగని సమయం ఒక నిర్ణయం…
ఎదురు చూడని హృదయం పలికిన
సంచలనాలతో నియంత్రించబడిన
వ్యవస్థగా సవాలు విసురుతు….
దాసోహమనే ఈ దాసితనపు చర్యలను
ప్రాపంచికం కాని గుణాలతో తుడిచేయి…
విశాల సముదాయంలో కనిపించే ప్రతిది
నీతో ఆరంభమవుతుంది….
ఇతిహాసమై నిలిచిన భాగవతాలను
పలుచబడుతున్న ప్రజాస్వామ్య
విలువలను కాపాడుకో…
ఒలికిన చీకటితో భవితవ్యం కానరాక
నేతలు రాయని అనాగరికథలను
చదువుతు సాధింపనుకోకు…
దేశ ఔన్నత్యాలను పొదుగుతు…
దారి పొంచుల అహంకారాలను తుంచుతు…
నడిచే ప్రగతి పథానికి జన విజ్ఞాన వేదికవై
నిలబడు…సమితివై ఒరిగిన బతుకులకు
స్వరాజ్యమై సంఘర్షణలను ఆపుతు…
నియమాల చేత స్కృషించబడుతు
నిర్వచనమై సాగిపో…
-దేరంగుల భైరవ