చినుకై వచ్చి వరదగా మారిన వాన
అలుపెరుగని వాన…
అంతులేని వాన…
ఆగమేఘాలపై వచ్చి…
ఎడతెరపకుండా కురిసే వాన…
చినుకై వచ్చి వరదగా మారి వరి
చేనుని ముంచేసావే…
శివుని జటిలో నుండి దూకే గంగమ్మల
ఉగ్రరూపాన్ని దాల్చి ఊర్లో జనులను
ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నావే…
నీ ఉనికిని చాటేందుకు నేలమ్మ
జాడను కనుమరుగు చేస్తున్నావే…
ఆగని నీ చినుకుల యుద్ధపు దాడిని ఆపేదెలా…
పెరిగిపోతున్న వరదల ఉద్రిక్తతను అడ్డుకునేదెలా…
వరదల దాడికి నేలపాలు అవుతున్న
రైతన్న శ్రమకు ప్రతిఫలాన్ని చేకూర్చేదెలా…
ఆకలి దప్పికలతో అల్లాడిపోతున్న వరద బాధితులకు
చుట్టూ నీళ్లున్న తాగేందుకు గుక్కెడు మంచినీళ్లను అందించేదెలా…
మార్గాలపై పారే సెలయేటిని చూసి
ప్రయాణించలేని వాహనాల వల్ల అత్యవసరాలు తీరేదెలా…
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడేదెలా…
అందుకే ఇకనైనా మా గోడును ఆలకించి, మమ్ము కరుణించి
వరదల ఉద్రిక్తతను తగ్గించి నిన్ను నీవు కొన్ని రోజులు
మేఘాలలో బంధించుకోవమ్మా నా ముద్దుల ఆకాశ గంగమ్మ…
-క్రాంతి కుమారి
కవిత బాగుంది
ధన్యవాదములు అండి 💐💐
Chala bhagundhi 👌👌👌👌
ధన్యవాదములు అండి 💐💐
Superb ma kranthi
Nyc