జగమంత కుటుంబం
భూమి మీద ఉండే మనవులంతా ఒక్కటే, అందరూ కలసి మెలసి ఉండాలని అందరూ భావిస్తారు. రామనాధం కూడా ఇదివరకు అలాగే భావించేవాడు కానీ ఇప్పుడు కాదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. చిన్నప్పుడు స్కూల్లో ఎడ్మిషన్ తీసుకొనేటప్పుడే మనం ఏ దేశమో వ్రాయాలి. అక్కడ మన మనసులో దేశాల వారీగా విభజన జరిగింది.
ఆ తర్వాత మతం కూడా వ్రాయాలి కాబట్టి మన మనసులో మతాల పట్టింపు వచ్చింది. ఆ తర్వాత కాలేజీ చదువులు చదివేప్పుడు కూడా కులాల బట్టీ రిజర్వేషన్ల ప్రస్తావన ఉంది. తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేప్పుడు కూడా కుల ప్రస్తావన ఉంది. రాష్టాల వారిగా ఉద్యోగావకాశాలు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను చూసిన మన మనసుల్లో రాష్ట్రాల వారీగా విభజన జరిగిపోయింది.
ఇలా దేశాలవారీగా, రాష్ట్రాల వారీగా, ప్రాంతాల వారీగా, మతాల వారీగా, కులాల వారీగా ప్రజల మనసులో అంతరాలు ఉన్నప్పుడు వసుదైక కుటుంబం అనే కాన్సెప్ట్ ఎలా పనిచేస్తుంది. ఇప్పట్లో ఇది సాధ్యపడదని రామనాధం భావిస్తున్నాడు. అతని మితృలైతే ఎప్పటికీ సాధ్యపడదని నిక్కచ్చిగా చెపుతూ ఉన్నారు. మానవ జాతి మనుగడలో వసుదైక కుటుంబంలా మానవాళి ఎప్పుడూ కలిసి ఉండలేదు. అది జరిగితే ఒక అధ్బుతం జరిగినట్లే. అలా ప్రజలను కలిపి ఉంచగలిగేది రచయితలు మాత్రమే.
– వెంకట భానుప్రసాద్ చలసాని