ఇడ్లీల పండగ
కాంతం ఒసేయ్ కాంతం..
నేను అలా బయటకు వెళ్లి టిఫిన్ తీసుకొస్తానె!
అన్నాడు పరంధామం..
లోపలి నుంచి వచ్చిన కాంతం టిఫిన్ చేసి వెళ్దురు గానీ
అంది ఆయన చెప్పులు వేసుకోవడం చూసి..
ఆ…ఆ…టిఫిన్ తేవడానికేనె అన్నాడు ఆమె చూపులు చూసి..
సరే లెండి కాస్త తొందరగా రండి మరి అంది ఆగేలా లేడనుకుని..
బాగా ఆకలేస్తున్నట్టుంది పాపం చెప్పుకోదు అనుకుని
ఇంతకీ ఏం టిఫిన్ తెమ్మంటావు? అన్నాడు..
అదేనండి తట్టె ఇడ్లీ చేస్తున్నా! తొందరగా రండి మరి..
ఏమిటీ? తట్టె ఇడ్లీ తేవాలా?
మనూర్లో అవి దొరుకుతాయా? దానికి కర్ణాటక వెళ్లాలి నేను అంత దూరం కాక పోయినా పక్క ఊరికయినా
వెళ్లాలి లేవే!
ఏం కాదు మామూలు ఇడ్లీ తెస్తానె! సరేనా!
ఎలా ఏమిటండి నా ప్రాణానికి యుట్యూబ్ ఉంది కదా!
దాంట్లో చూసే నేర్చుకున్నా! అంది కాంతం..
సరె సరె లేటవుతుంది నే వెళ్లి తెస్తా! అని నవ్వుకుంటూ
వెళ్లాడు పరంధామం..
ముసి ముసిగా నవ్వుకుంటూ తట్టె ఇడ్లీ చేయడానికి
లోపలికి వెళ్లింది కాంతం..
ఇంకేముంది?
కాంతం ఇడ్లీలు పరంధామం ఇడ్లీలు..
వెరసీ ఆ రోజంతా ఇడ్లీల పండగ అయింది దంపతులకు..
మరి వాళ్లిద్దరికీ చెవులు వినపడవు..
అదీ సంగతి..
మీకు నవ్వు వచ్చిందా? వస్తే నవ్వండి లేకపోతె లేదు
ఏం చేస్తాం? ఇలాగయితే రాసామరి..
-ఉమాదేవి ఎర్రం..