Happy new year
కొత్త ఆశల వేదికలుగా
సరికొత్త సన్నాహాల సమీరంగా
మార్పుకు ఆహ్వానం పలుకుతూ
మదిలో సంతోషాలు నింపుకొని
కొత్త ఉత్సాహంతో
సరికొత్త నిర్ణయాలతో
సాగమటోంది కొత్త సంవత్సరం
నిన్నటి రోజు అనుభవాలతో
మది తొలిచే సందేహాలతో
ఆశయాల అడుగులలో
విజయాల బాటలో
ఆరోగ్యం చెదరనీయక చిట్టి కోరికల చిట్టాలతో కొత్త వెలుగుల కోణాల్లో
కొత్తదనాల ప్రపంచంలో ఆశల రెక్కలు విప్పుకొని లక్ష్యాల లాంఛనాలు పూర్తి చేసుకోవాలి
శాంతి సౌఖ్యాలతో
వెలుగొందాలి కొత్త సంవత్సరం ప్రారంభతో ప్రపంచమంతా….?
– జి జయ