జ్ఞాపకం
మరువలేని మనోఫలక భావం
ఎన్నో భావాల సమాహారం జ్ఞాపకం
మదికి చెప్పలేని భారం
వ్యక్తం చేయలేని ఖరం
మధుర జ్ఞాపకం అభ్యున్నతి కారకం
స్పందించే హృదయానికి సహకారం
సలసల కాగే అగ్నికుండం చేదు జ్ఞాపకం
దహించేను తనువును ఆజ్యమై
పరిపరి విధాల పరితపించే మనసుకు
రమణీయ మధురగానం ఒక జ్ఞాపకం
నీలవర్ణపు కాంతి తోడ వెలుగులు
పంచే అందాల పడతి మోము
ఒక మరువలేని మధుర జ్ఞాపకం
అదిలించలేని అంధకారానికి
జ్ఞాపకమే ఒక కారణం
మదిని ఆక్రమించిన విశాల
విస్తృత విజ్ఞాన విహాంగమూ జ్ఞాపకమే
అవని అందమూ జ్ఞాపకమే
అతివ సౌందర్యమూ జ్ఞాపకమే
ప్రకృతి సౌరాభమూ జ్ఞాపకమే
మనోఫలకంపై లిఖించలేని జ్ఞాపకం
ఏమున్నది అవనిపైన
– శ్రేష్ఠి