గణతంత్ర దినోత్సవం
గణతంత్ర దినోత్సవం అంటే ఒకప్పుడు
పిల్లల ఆటలు,పాటలు, దేశభక్తి గీతాలు
మా అందరి సంబరాలు, బడిలో
ఆటల పోటీలు, గెలిచినా ఓడినా అదో ఆనందం
జెండా పండుగ కోసం ఎదిరి చూపులు..
స్వేచ్చ వాయువులు పీలుస్తూ, ఆడుకునే అందమైన రోజులు, అందరి రోజులు కానీ…
గత రెండేళ్లుగా జెండా పండుగ అంటే దూరం అయ్యి
సంబరాలను, సంతోషాలను దూరం చేసిన
కరోనా మంహమ్మరి కేకలు…
సంబరాలు లేని జెండా రెపరెపలు చూడని కన్నులు
దేశభక్తి గీతాలు లేని పాఠశాలలు..
పిల్లలు లేని సంబరాలు..
మూసేసిన గేటు ముందు అయిందనిపించిన ఉపాధ్యాయులు…
మళ్ళీ మంచిరోజులు వస్తాయని ఎదురు చూస్తూ
సంబరంగా జరుపుకునే గణతంత్ర వేడుకల కోసం
మా పిల్లల ఎదిరి చూపులు.. వస్తాయని రావాలని కోరుకుందాం…
-ప్రణవ్